వినోదం

గజ్జె ఘ‌ల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో పాటలో బూతు ఉంద‌న్న ఎస్పీ బాలు.. అందులో అర్థం ఏమిటి..?

స్వర్గీయ బాలు ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసారో తెలియదు, కానీ కమర్షియల్ సినిమాలు అన్నాకా అలాంటి ద్వంద్వార్థ పాటలు, సంభాషణలు అత్యంత సహజం.. అదొక ఫార్ములా అని చెప్పవచ్చు.. ఎందుకంటే 80-90 దశకాల్లో సినిమాలు ఎంత ప్లాప్ అయినా సరే థియేటర్ లో ఎక్కువగా ఆదరించింది బి, సీ క్లాస్ ప్రేక్షకులు మాత్రమే.. వారిని ఉర్రూతలూగించడానికి అటువంటి ఫార్ములాలు తప్పనిసరి.. ఇక ఈ పాట విషయానికి వస్తే రాజ్-కోటి సంగీత ద్వయం స్వరాలు అందించారు.. బావ-బావమరిది చిత్రంలోనిది.. సినిమాలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.. అందువల్ల ప్రేక్షకులు ముఖ్యంగా కాలేజీ యువకులు, కొంచెం శ్రామిక వర్గం వారిని ఆకర్షించడానికి ఇటువంటి తరహా పాటని పెట్టి ఉండవచ్చు..

నిజానికి ఆ రోజుల్లో ఈ సినిమా చూడడానికి వచ్చే వారి కన్నా బావలు సయ్య, మరదలు సయ్యా”, ఈ గజ్జె ఘల్లుమన్నదో పాటలు చూడడానికి వచ్చినవారి వల్లే సినిమా భారీ స్థాయి విజయం అందుకుంది.. ఆకాశవాణి లో, వివిధ భారతి కార్యక్రమాల్లో కూడా ఈ పాటని ఎంతమంది అడిగేవారో లెక్కేలేదు.. అంత విశేష ఆదరణను చూరగొంది మరి ఈ ద్వంద్వార్థపు గీతం.. పాటలో సాహిత్యం కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది, ఉదాహరణకు మొదటి చరణమే తీసుకుంటే గజ్జె ఘల్లుమన్నదో.. గుండె ఝల్లుమన్నదో.. కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో.. తట్టుకో తడే తమాషా.. ఇచ్చుకో ఒడే మజాగా.. లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార.. కావిళ్ళు మొయ్యాలిలే.. సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది.. నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో.. ఇలా సాగుతుంది.

is there any second meaning in gajje ghallumannado song

కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పాట రచయిత ఎక్కడా జుగుస్సాపకరమైన పదప్రయోగాలు వాడ‌లేదు.. అసభ్య పదాలు వాడలేదు.. కేవలం ద్వందార్ధాలు మాత్రమే.. పాటలో సాహిత్యం గురించి వినేవాళ్లకు పెద్దగా పట్టలేదు, కానీ నేపధ్య సంగీతం, ఆ వేణు నాదంలో , ఇప్పటికీ ఆ పాట వింటుంటే ఎదో లోకం తేలుతున్నట్లు ఉంటుంది.. చిత్రీకరణ కూడా కొంచెం రాఘవేంద్రరావు స్టైల్ తో తీశారు దర్శకుడు శరత్ .. కాబట్టిట్టి ఇక్కడ సినిమా అనేది కళా సేవ కాదు, కళాత్మక వ్యాపారం మాత్రమే అని గుర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రాక్టికల్ గా.. ఇక స్వయంగా బాలు గారే అలాంటి ద్వందార్ధపు పాటలు అనేకం తన గాత్రంలో అనేక సినిమాల్లో అందించారు కూడా.. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు గొంగట్లో తింటూ, వెంట్రుకలు ఏరుకోవడం అనే ఒక సామెత ని గుర్తుకు తెచ్చింది..

Admin

Recent Posts