వినోదం

శంకరాభరణం సినిమాను హిట్ చేశారు.. రుద్రవీణని ఎందుకు అంగీకరించలేదు?

<p style&equals;"text-align&colon; justify&semi;">శంకరాభరణం సినిమా 1980à°²‌లో విడుదలయ్యింది&period; ఆబాల గోపాలాన్ని ఏదో ఒక కోణంలో అలరించిన సినిమా అది&period; సంస్కృతీ&comma; సంగీతాల కలబోత అది&period; ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ఒక కారణం శంకర శాస్త్రి గా నటించిన సోమయాజులు&period; ఈయన ఆహార్యం&comma; అభినయం బాగా ఆ పాత్రకు చక్కగా అతికినట్టు సరిపోయాయి&period; ఈ సినిమాలో నటించడానికే ఆయన పుట్టారేమో మరి&excl;&excl;&excl; డైలాగ్ డెలివరీ లో ఆయన గాత్రం ఎంత గాంభీర్యంగా ఉందో అప్పటి ప్రేక్షకులకు తెలుసు&period; మంజు భార్గవి నటన&comma; నాట్యం ఆ చిత్రానికి అదనంగా అమరిన హంగులు&period; మంజుభార్గవి కొడుకుగా తులసి నటన కూడా చిన్న పిల్లలను అప్పట్లో కట్టి పడేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రమోహన్ చెంబు కామెడీ సామాన్య ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేసింది&period; అతనికి జోడీగా రాజ్యలక్ష్మి నటన బాగా రక్తి కట్టింది&period; ఈ సినిమాలో లేని రసం లేదు&period; వరలక్ష్మి బాల నటిగా నీళ్ల గుంతలో దిగి సరిగమలు నేర్చుకునే సన్నివేశం అప్పట్లో బాగా గుర్తుండి పోయింది&period; ప్రతి ఫ్రేమ్ ను కళా తపస్వి విశ్వనాథ్ తీసిన తీరు అనితరసాధ్యం&period; ఇప్పటికీ ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం à°®‌à°¨‌ మనసులో రూపు కట్టుకునే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75582 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rudra-veena-movie&period;jpg" alt&equals;"why people not accepted rudra veena movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శంకరాభరణం హిట్ కావడానికి మరో కారణం అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్&period; అప్పటికి ఇంకా సినిమా టేకింగ్ లో ఆధునిక పోకడలు ప్రవేశించలేదు&period; అసలు ఒకప్పుడు మద్రాస్&comma; మధురై నగరాల్లో సంగీతానికి ఉన్న క్రేజ్ మా అనంతపురం లో కూడా ప్రవేశించింది అంటే దానికి కారణం శంకరాభరణం సినిమానే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రుద్ర వీణ సినిమా విషయానికి వస్తే అది శంకరాభరణం స్థాయిలో హిట్ కాకపోవడానికి కారణం చిరంజీవి మాస్ ఇమేజ్&period; చిరుని ఆ పాత్రలో ప్రజలు సరిగా రిసీవ్ చేసుకోలేక పోయారు&period; అది కాక అప్పటికే సినిమాల్లో బ్రేక్ డాన్స్ లు&comma; డిస్కో డాన్స్ లు ప్రవేశించాయి&period; క్లాసిక్స్ ను ఆదరించే ఓపిక ప్రేక్షకులకు తగ్గిపోయింది&period; సామాజిక స్పృహ తో సినిమాలకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు&period; శోభన&comma; చిరూ పోటాపోటీగా నటించిిినా కూడా అప్పటికే చిరంజీవి ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోవడం వల్ల రుద్రవీణకు శంకరాభరణం రేంజ్ లో హిట్ టాక్ రాలేదు&period; కానీ చిరు సినీ ప్రస్థానంలో రుద్రవీణ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts