Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు పోజిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. చేసింది తక్కువే సినిమాలు కానీ అబ్బాయిలకు హాట్ ఫేవరెట్. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. బేబమ్మా అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు.. ఎవరో గుర్తుపట్టారా..? ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు కృతి శెట్టి.
టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి.. వెంట వెంటనే క్రేజ్ ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అబ్బాయిల్లో బాగా పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజుతో వరుస హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ అమ్మడు మళ్లీ ఎప్పుడు ట్రాక్ లోకి వస్తుందో చూడాలి.