వినోదం

తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

అమ్మ-ఆవకాయ్-అంజలి ఎప్పటికి ఎలా బోర్ కొట్టావో… అలానే కొన్ని సినిమా కాంబోలు కూడా ఎప్పటికి బోర్ కొట్టవు. ఆ కాంబోలు కొన్ని సార్లు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మళ్ళీ, మళ్ళీ ఆ కాంబోస్ లో సినిమాలు వస్తే చూడాలి అని ప్రతి ఒక్కరికి వుంటుంది. అలాంటి కొన్ని అందమైన కాంబోస్ ఏవో, ఆ కాంబోస్ ని మళ్లీ ఎందుకు చూడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు చూద్దాం రండి.

గురూజీ – పవర్‌స్టార్.. వీరి కాంబోలో జల్సా తర్వాత 2 సినిమాలు వచ్చాయి. సమంత – నాగ చైతన్య.. ఏ మాయ చేసావే, మజిలీ లాంటి అందమైన సినిమాలు ఈ కాంబోలో వచ్చాయి. అయితే వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు క‌నుక ఇక‌పై వీరు క‌ల‌సి న‌టించే అవ‌కాశం దాదాపుగా లేద‌నే చెప్పాలి. శేఖర్ కమ్ముల – కమలినీ ముఖర్జీ.. ఒక ఆనంద్, ఒక గోదావరి. ఒక రూప, ఒక సీత. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం ఈ రెండు సినిమాలు, ఈ రెండు పాత్రలు సజీవంగా ఉంటాయి. పూరి – మహేష్.. ఎంతమంది దర్శకులు – హీరోల కాంబోలు ఉన్నా, ఈ కాంబోకి ఉన్న క్రేజ్ యే వేరు.

these are the best combos shall we see them again

ప్రభాస్ – అనుష్క.. వీరి కాంబో అంటే సినిమా హిట్ గ్యారంటీ అన్న టాక్ ఉంది. మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబో వ‌స్తుందో, రాదో చూడాలి. నాని – గౌతమ్ వాసుదేవ్ మీనన్. క్రిష్ జాగర్లమూడి – అల్లు అర్జున్. శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపీ మోహన్.. వీళ్ల కాంబినేష‌న్ల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు ఎవరైన వెళ్లి ఈ ముగ్గురిని మళ్లీ కలపండి అయ్యా అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం వీరు ఎవరికి వారే, యమునా తీరే అన్నట్లు ఉన్నారు.

Admin

Recent Posts