ఒక తెలుగు సినిమా 1000కోట్ల కలెక్షన్ను సంపాదిస్తుంది అని ఎవరైనా ఊహించి ఉంటారా! కానీ రాజమౌళి తన సినిమాలతో బాక్సాఫీస్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు, రాజమౌళి ఇచ్చిన నమ్మకంతో ఇంకా ఎంతోమంది ఫిలిం మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. చాలా వరకు రాజమౌళి అంతా బడ్జెట్ పెడుతున్నారు కానీ రాజమౌళి గారు సంపాదించినంత ఫలితం మాత్రం ఎవరూ సంపాదించట్లేదు. కానీ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో 1000కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మిగతా భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ, పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తే చాలు అని లెక్కలోనే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలే కాకుండా మిగతా డైరెక్టర్ ల సినిమాలు కూడా అత్యధిక కోట్ల కలెక్షన్లను సాధించాలి అని చాలామంది కోరుకుంటున్నారు.
#1 రాజమౌళి-మహేష్ బాబు 800 కోట్ల బడ్జెట్
రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికి ,ఈ సినిమాకు గాను 800 వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు.
#2 కల్కి- 600 కోట్ల బడ్జెట్
ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా కల్కి 2 పేరుతో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు.
#3 RRR-550 కోట్ల బడ్జెట్
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా 550 కోట్ల బడ్జెట్ అయింది.
#4 పుష్ప-2 400 కోట్ల బడ్జెట్
పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప-2 సినిమాకి దాదాపు 400 కోట్ల రూపాయలు బడ్జెట్ అని తెలిసింది.
#5 సాహో 350 కోట్ల బడ్జెట్
ప్రభాస్ నటించిన సాహో సినిమా లో కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు గాను 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.
#6 రాధేశ్యామ్ – 300 కోట్ల బడ్జెట్
#7 సైరా నరసింహా రెడ్డి – 300 కోట్ల బడ్జెట్
#8 బాహుబలి 2 – 250 కోట్ల బడ్జెట్
#9 సలార్ – 200 Cr బడ్జెట్
#10 పుష్ప పార్ట్ 1 – 200 కోట్ల బడ్జెట్