తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీకే పెద్దగా స్టార్ హోదా లో కొనసాగుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఈ హీరో అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఇప్పటికే 150 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే.. చిరంజీవి సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్ట్ చేస్తాయి. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నిర్మాతలకి ఎక్కువ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే చిరు కెరీర్ డైరెక్ట్ సినిమాలు ఎలా అయితే హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయో కొన్ని రీమేక్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అలానే హిట్ అయ్యాయి.
హిట్లర్, ఘరానా మొగుడు సినిమాల నుండి మొన్న వచ్చిన గాడ్ ఫాదర్ వరకు చిరు చేసిన రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒరిజినల్ సినిమాల కంటికి కూడా ఎక్కువ వసూలు రాబట్టాయి. ఇందులో కొన్ని చిరు రీమేక్స్ వాటికి వచ్చిన కలెక్షన్ ఇప్పుడు చూసేద్దాం. హిట్లర్ మలయాళం మూవీ కలెక్షన్స్ 10 కోట్లు గ్రాస్ కాగా హిట్లర్ తెలుగు 15 + 10 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. పూవును పుతియా పుంతెంనల్ 3-4 కోట్లు వసూలు చేయగా పసివాడి ప్రాణం 5+ కోట్లు వసూలు చేసింది. అలాగే అమ్మన్ కోవిల్ కిజకాలే 3 కోట్లు వసూలు చేయగా రీమేక్ చిత్రం ఖైదీ నెంబర్ 786 ఐదు+ కోట్లు వసూలు చేసింది.
అలాగే అనురాగ అరలీతు 5-6 కోట్లు వసూలు చేయగా ఘరానా మొగుడు 10+కోట్లు వసూలు చేసింది. రమణ 15 కోట్లు వసూలు చేయగా దీని రీమేక్ ఠాగూర్ 28+ కోట్లు వసూలు చేసింది. మున్నాభాయ్ 37 కోట్లు, శంకర్ దాదా ఎంబిబిఎస్ 28+కోట్లు వసూలు చేసింది. కత్తి 130 కోట్లు, ఖైదీ నెంబర్ 150 165 + కోట్లు వసూలు చేసింది. లూసిఫర్ 30 కోట్లు, గాడ్ ఫాదర్ 108 కోట్లు వసూలు చేశాయి.