వినోదం

“విక్రమ్” సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ముందుగా అనుకున్న నటులు ఎవరో తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ముఖ్య పాత్రలో నటించారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కాగా విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం ముందుగా మరో ఇద్దరు నటులను అనుకున్నారట. ఈ విషయాన్ని మూవీ లో విజయ్ కి రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన జాఫర్ సాదిక్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

vijay sethupathi is not the first choice for vikram movie

జాఫర్ సాదిక్ మా లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం ముందుగా ప్రభుదేవా, రాఘవ లారెన్స్ న్యూ చిత్రబృందం అనుకున్నారని… కాకపోతే చివరకు ఏమైందో తెలియదు కానీ ఆ పాత్రలో విజయ్ సేతుపతిని మేకర్స్ ఫైనల్ చేశారని తెలిపారు. ఇలా ముందుగా విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ప్రభుదేవా, రాఘవ లారెన్స్ ను అనుకున్న చిత్రబృందం చివరగా విజయ్ సేతుపతిని తీసుకుంది. త‌రువాత సినిమా ఎలా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో అంద‌రికీ తెలుసు.

Admin

Recent Posts