Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Divya Bharti : దివ్యభారతిది హత్యా లేక ఆత్మహత్యా..? అసలు ఆమె మరణించిన రోజు ఏం జరిగింది..?

Admin by Admin
January 1, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Divya Bharti : 1990 దశాబ్దంలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ దివ్యభారతి. అతి చిన్న వయసులోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో టాలీవుడ్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో దివ్య భారతి నటించి అలరించింది.

బాలీవుడ్ లో దివానా, రంగ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దివ్యభారతి టాలీవుడ్ లో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మ క్షేత్రం, చిట్టెమ్మ మొగుడు లాంటి సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అప్పటి హీరోయిన్లలో దివ్యభారతి అంతా బ్యూటీ ఫుల్ హీరోయిన్ ఎవరు లేరు. చిన్న వయసులోనే ఎంతో స్టార్ డమ్ ని పొందిన దివ్యభారతి కేవలం 19 ఏళ్ల వయసులోనే ఏప్రిల్ 5 1993 లో ఈ లోకానికి దూరమయ్యింది. అయితే దివ్యభారతి ఎలా చనిపోయింది అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు ఒక సరైన క్లారిటీ రాలేదు. కోర్టు కూడా ఆమె కేసులో సరైన తీర్పు ఇవ్వకుండానే 1998 లో కేసును క్లోజ్ చేసేసింది. కానీ ఆమె అభిమానులకు ఇప్పటికి కూడా దివ్యభారతి మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతానే ఉన్నాయి.

what happened to divya bharathi on that day

అసలు దివ్యభారతి మరణం రోజు ఏం జరిగింది అనే విషయానికి వెళితే.. దివ్యభారతి తన భర్త సాజిత్ తో కలిసి ముంబైలోని ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేది. చనిపోయిన రోజు దివ్యభారతి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అదే రోజు తన పేరెంట్స్ కోసం ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అన్ని పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న దివ్య భారతి తన మేకప్ ఆర్టిస్ట్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. మేకప్ ఆర్టిస్ట్ తో పాటు ఆమె భర్త సాజిత్ కూడా వెంట వచ్చాడు. ఆ తరవాత అందరూ కలిసి మద్యం సేవించారు. అప్పటి వరకు వాళ్లతో మాట్లాడిన దివ్యభారతి ఉన్నట్టుండి బాల్కనీ నుండి క్రిందకు పడిపోయింది.

తలకు బలమైన గాయం అయ్యి రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మరణం పై భర్త సాజిత్ కానీ, అక్కడే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ గానీ నోరు విప్పలేదు. మరోవైపు దివ్యభారతి మరణం వెనక దావూద్ ఇబ్రహీం డీ గ్యాంగ్ హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా అప్పటిలో గట్టిగా వినిపించాయి. అంతేకాకుండా ఆమె భర్త సాజిత్ ముంబై పేలుళ్ల కేసు నుండి బయట పడేందుకు గాను ఆమెను హత్య చేసి ఉంటాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సినిమాల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగవలసిన దివ్యభారతి అతి చిన్న వయసులోనే నింగి ఎగసి ఎంతోమంది అభిమానులకు బాధను మిగిల్చింది.

Tags: Divya Bharti
Previous Post

జామ‌కాయ‌ల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

Next Post

Green Peas : ప‌చ్చి బ‌ఠానీల‌ను ఆహారంలో చేర్చుకుంటే ఇన్ని లాభాలా.. త‌ప్ప‌క తీసుకోవాల్సిందే..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.