Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పెదరాయుడు సినిమాకి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటంటే ?

Admin by Admin
April 14, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతికలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్.. ఈ ఒక్క డైలాగ్ చాలు సాయికుమార్ ని డైలాగ్ కింగ్ అని చెప్పడానికి. అంతేకాదు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాయికుమార్ డబ్బింగ్ జత కలిస్తే అత్యద్భుతంగా మారుతుంది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా.. ఆయన ప్రవేశిస్తే సంచలనం.. హీరో ఎవరైనా, భాష ఏదైనా.. ఆయన గొంతు సాయం చేస్తే ఆ పాత్ర చిరస్థాయి జ్ఞాపకం.

తండ్రి నుండి వారసత్వంగా అనువాద కలను అలవాటు చేసుకున్న సాయికుమార్ రంగస్థల కళాకారుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. సాయి కుమార్ తండ్రి జై శర్మ కూడా మంచి నటుడు అలాగే కంచు కంఠంతో డబ్బింగ్ చెప్పేవారు. ఆయన గొంతు తన ముగ్గురు కుమారులకు వచ్చింది. సాయి కుమార్ తో పాటు రవిశంకర్ కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కెరియర్ లో దూసుకుపోతున్నారు. అలాగే సాయికుమార్ చిన్న తమ్ముడు అయ్యప్ప కూడా ఇటీవల కేజీఎఫ్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగులో నేరుగా చేసిన సినిమాలలో కూడా సాయికుమార్ తన గాత్రం అందించారు.

what is the relation between sai kumar and peda rayudu movie

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెదరాయుడు. మోహన్ బాబు – రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన పెద్దరాయుడు ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలోని డైలాగులు ఇప్పటికీ హైలెట్. రజనీకాంత్ గొంతులోని సాయికుమార్ గాంభీర్యం ఈ సినిమాలోని పాపారాయుడు పాత్రకి ఆయువుపట్టు. ఈ చిత్రం ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే రజనీకాంత్ కోసం, ఆయన చెప్పే డైలాగ్స్ కోసం చూసేవారు చాలామంది ఉన్నారు. అంతలా సాయికుమార్ ఎందరో బయటనటులను మన తెలుగు వారికి చేరువ చేశారు.

Tags: sai kumar
Previous Post

ఇండియ‌న్ రైల్వే లో ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ డ్రైవ‌ర్ వేత‌నం ఎంతో తెలుసా? రైల్వేస్ గురించి 11 షాకింగ్ నిజాలు!

Next Post

చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?

Related Posts

వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!