వినోదం

TRP రేటింగ్ లో ఇంత విషయం దాగుందా..అదేంటో తెలుసుకుందాం.. ఆడవాళ్లు చూసే సీరియల్స్..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు అంటే ఏమోగానీ ఇప్పుడు సినిమాల కన్నా టీవీల ప్రభావమే జనాలపై బాగా ఎక్కువగా ఉంది&period; ఒకప్పుడు కేవలం వారాంతాల్లో వచ్చే సినిమాలు&comma; పాటలను చూసేవారు&period; అప్పుడప్పుడు వచ్చే క్రికెట్‌ మ్యాచ్‌లు&comma; రోజూ వచ్చే వార్తలు చూసి ఆ మాత్రానికే సంతోషించేవారు&period; నిజమైన వినోదాన్ని ఎంజాయ్‌ చేసే వారు&period; కానీ ఆ వినోదం ఇప్పుడు 24 గంటలు అయింది&period; టీవీ ఆన్‌ చేస్తే చాలు ఎప్పుడూ ఏదో ఒక చానల్‌లో ఏదో ఒక ప్రోగ్రామ్‌ వస్తూనే ఉంటుంది&period; ఇక టీవీ సీరియల్స్‌కు అయితే లెక్క లేదు&period; దీంతో జనాలకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది&period; అయితే టీవీ చానల్స్‌లో వచ్చే ప్రోగ్రామ్‌à°² సంగతి సరే&period;&period; మరి వాటిని ఎవరు ఎక్కువ చూస్తున్నారు అనే సంగతి తెలుసుకోవడం ఎలా &quest; ఎవరైనా ఇంటి ఇంటికీ తిరిగి ఆ విషయాన్ని ఎంక్వయిరీ చేస్తారా &quest; మీరు ఏ చానల్‌లో ఏ ప్రోగ్రామ్‌ ఎక్కువగా చూస్తారు అనే విషయాన్ని జనాలను అడిగి మరీ తెలుసుకుంటారా &quest; అంటే&period;&period; అలా కాదు&period;&period; అందుకు ఓ పద్ధతి ఉంది&period; అదే బార్క్‌ రేటింగ్స్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్క్‌ రేటింగ్స్‌ అనే విషయాన్ని మరో మాటలో చెప్పాలంటే టీఆర్‌పీ రేటింగ్‌ అని అనవచ్చు&period; అంటే టీఆర్‌పీ రేటింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే టీవీ చానల్స్‌కు ఆయా ప్రోగ్రామ్‌లకు వచ్చే యాడ్స్‌ అన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట&period; దీంతో చానల్స్‌కు కూడా ఆదాయం వస్తుంది&period; టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి వాళ్లు యాడ్‌ రేట్లను ఫిక్స్‌ చేస్తారు&period; నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌కు టీఆర్‌పీ రేటింగ్‌ ఎక్కువ వస్తుంది అనుకోండి&period;&period; దానికి ఆ చానల్‌ వారు యాడ్స్‌ను ప్రదర్శించినందుకు ఎక్కువ మొత్తం డబ్బు వసూలు చేస్తారన్నమాట&period; అందుకు అనుగుణంగానే ప్రోగ్రామ్‌లకు వచ్చే టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి యాడ్‌ రేట్లను నిర్ణయిస్తారు&period; దాంతో టీవీ చానల్స్‌ వారికి ఆ యాడ్స్‌ ద్వారా ఆదాయం వస్తుంది&period; అయితే అంతా బాగానే ఉంది&period;&period; ఈ రేటింగ్స్‌ను ఎవరు ఇస్తారు &quest; అంటే&period;&period; అందుకు ఓ సంస్థ పనిచేస్తుంది&period; దాని పేరు బార్క్‌ &lpar;BARC&rpar;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90092 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;trp-rating&period;jpg" alt&equals;"what is trp rating and how does it work " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్క్‌ అంటే Broadcast Audience Research Council India అని అర్థం&period; ఈ సంస్థ మనదేశంలో ఉన్న అన్ని టీవీ చానళ్ళు&comma; వాటిల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది&period; వాటిల్లో ఆయా భాషలను బట్టి&comma; జోనర్‌లను బట్టి వచ్చే ప్రోగ్రామ్‌లను ఎంత మంది చూస్తున్నారు&comma; అవి ఏయే తేదీల్లో&comma; ఏయే సమయాల్లో ప్రసారమవుతున్నాయి&comma; ప్రసారమైన సమయాన్ని బట్టి ఎంత మంది చూస్తున్నారు&period;&period; తదితర వివరాలను సేకరించి టీఆర్‌పీ రేటింగ్‌ ను ఇస్తుంది&period; అయితే ఈ డేటాను సేకరించడం కోసం వారు నిర్దిష్టమైన టీవీలను ఎంచుకుని వాటిల్లో ప్రత్యేకమైన పరికరాలను అమర్చుతారు&period; ఈ పరికరాలు టీవీల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లలో వచ్చే ఆడియోలో ఉండే ఎంబెడ్డెడ్‌ వాటర్‌ మార్క్‌ సౌండ్లను గుర్తిస్తాయి&period; ఈ వాటర్‌ మార్క్‌ సౌండ్లు మన చెవులకు వినిపించవు&period; కానీ ఆ పరికరాలు మాత్రం గుర్తిస్తాయి&period; దీంతో ఆ పరికరాలు ఆ సౌండ్లను గుర్తించి అందుకు తగిన విధంగా ప్రోగ్రామ్‌ డేటాను జనరేట్‌ చేసి పైన చెప్పిన బార్క్‌ సంస్థకు ఇస్తాయి&period; వారు ఆ డేటాను విశ్లేషించి ఏ టీవీ చానల్‌ను జనాలు ఎక్కువగా చూస్తున్నారు&comma; ఏ ప్రోగ్రామ్‌ను వారు ఎక్కువగా చూస్తున్నారు అనే డేటాను టేబుల్‌ రూపంలో ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ రేటింగ్స్‌ డేటా ఎప్పుడూ మారుతూ ఉంటుంది&period; ఎప్పుడూ ఒకే చానల్‌ లేదా ఒకే ప్రోగ్రామ్‌ టాప్‌లో ఉండదు&period; ఎందుకంటే&period;&period; ఉదాహరణకు&period;&period; ఐపీఎల్‌ మ్యాచ్‌లు వస్తున్నాయి కదా&period;&period; కనుక సహజంగానే ఆ మ్యాచ్‌లను ప్రసారం చేసే టీవీ చానల్‌నే ఈ సీజన్‌లో ఎక్కువగా చూస్తారు&period; అది కూడా సాయంత్రం సమయాల్లో కనుక ఆ సమయంలో ఆ చానల్‌ను చూసే వారు ఎక్కువ ఉంటారు కనుక ఆ సమయంలో ఆ చానల్‌కు రేటింగ్‌ ఎక్కువ ఉంటుంది&period; ఇక మిగిలిన సమయాల్లో ఉండదు&comma; కనుక ఆ చానల్‌కు మిగిలిన సమయాల్లో రేటింగ్‌ మారుతుంది&period; ఇలా టీఆర్‌పీ రేటింగ్స్‌ ఉంటాయి&period; అయితే ఈ రేటింగ్స్‌ను మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకోవచ్చు&period; అందుకు పైన చెప్పిన బార్క్‌ సైట్ ను సందర్శించాలి&period; దీంతో మీకు కూడా మన దేశంలో ఉన్న టీవీ చానల్స్‌&comma; వాటి ప్రోగ్రామ్‌లకు చెందిన టీఆర్‌పీ రేటింగ్స్‌ తెలుస్తాయి&period; ఇదీ&period;&period; టీవీ చానల్ టీఆర్‌పీ రేటింగ్స్‌ వెనుక ఉన్న అసలు కథ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts