Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

TRP రేటింగ్ లో ఇంత విషయం దాగుందా..అదేంటో తెలుసుకుందాం.. ఆడవాళ్లు చూసే సీరియల్స్..?

Admin by Admin
June 29, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకప్పుడు అంటే ఏమోగానీ ఇప్పుడు సినిమాల కన్నా టీవీల ప్రభావమే జనాలపై బాగా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు కేవలం వారాంతాల్లో వచ్చే సినిమాలు, పాటలను చూసేవారు. అప్పుడప్పుడు వచ్చే క్రికెట్‌ మ్యాచ్‌లు, రోజూ వచ్చే వార్తలు చూసి ఆ మాత్రానికే సంతోషించేవారు. నిజమైన వినోదాన్ని ఎంజాయ్‌ చేసే వారు. కానీ ఆ వినోదం ఇప్పుడు 24 గంటలు అయింది. టీవీ ఆన్‌ చేస్తే చాలు ఎప్పుడూ ఏదో ఒక చానల్‌లో ఏదో ఒక ప్రోగ్రామ్‌ వస్తూనే ఉంటుంది. ఇక టీవీ సీరియల్స్‌కు అయితే లెక్క లేదు. దీంతో జనాలకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. అయితే టీవీ చానల్స్‌లో వచ్చే ప్రోగ్రామ్‌ల సంగతి సరే.. మరి వాటిని ఎవరు ఎక్కువ చూస్తున్నారు అనే సంగతి తెలుసుకోవడం ఎలా ? ఎవరైనా ఇంటి ఇంటికీ తిరిగి ఆ విషయాన్ని ఎంక్వయిరీ చేస్తారా ? మీరు ఏ చానల్‌లో ఏ ప్రోగ్రామ్‌ ఎక్కువగా చూస్తారు అనే విషయాన్ని జనాలను అడిగి మరీ తెలుసుకుంటారా ? అంటే.. అలా కాదు.. అందుకు ఓ పద్ధతి ఉంది. అదే బార్క్‌ రేటింగ్స్‌.

బార్క్‌ రేటింగ్స్‌ అనే విషయాన్ని మరో మాటలో చెప్పాలంటే టీఆర్‌పీ రేటింగ్‌ అని అనవచ్చు. అంటే టీఆర్‌పీ రేటింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే టీవీ చానల్స్‌కు ఆయా ప్రోగ్రామ్‌లకు వచ్చే యాడ్స్‌ అన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో చానల్స్‌కు కూడా ఆదాయం వస్తుంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి వాళ్లు యాడ్‌ రేట్లను ఫిక్స్‌ చేస్తారు. నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌కు టీఆర్‌పీ రేటింగ్‌ ఎక్కువ వస్తుంది అనుకోండి.. దానికి ఆ చానల్‌ వారు యాడ్స్‌ను ప్రదర్శించినందుకు ఎక్కువ మొత్తం డబ్బు వసూలు చేస్తారన్నమాట. అందుకు అనుగుణంగానే ప్రోగ్రామ్‌లకు వచ్చే టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి యాడ్‌ రేట్లను నిర్ణయిస్తారు. దాంతో టీవీ చానల్స్‌ వారికి ఆ యాడ్స్‌ ద్వారా ఆదాయం వస్తుంది. అయితే అంతా బాగానే ఉంది.. ఈ రేటింగ్స్‌ను ఎవరు ఇస్తారు ? అంటే.. అందుకు ఓ సంస్థ పనిచేస్తుంది. దాని పేరు బార్క్‌ (BARC).

what is trp rating and how does it work

బార్క్‌ అంటే Broadcast Audience Research Council India అని అర్థం. ఈ సంస్థ మనదేశంలో ఉన్న అన్ని టీవీ చానళ్ళు, వాటిల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. వాటిల్లో ఆయా భాషలను బట్టి, జోనర్‌లను బట్టి వచ్చే ప్రోగ్రామ్‌లను ఎంత మంది చూస్తున్నారు, అవి ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ప్రసారమవుతున్నాయి, ప్రసారమైన సమయాన్ని బట్టి ఎంత మంది చూస్తున్నారు.. తదితర వివరాలను సేకరించి టీఆర్‌పీ రేటింగ్‌ ను ఇస్తుంది. అయితే ఈ డేటాను సేకరించడం కోసం వారు నిర్దిష్టమైన టీవీలను ఎంచుకుని వాటిల్లో ప్రత్యేకమైన పరికరాలను అమర్చుతారు. ఈ పరికరాలు టీవీల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లలో వచ్చే ఆడియోలో ఉండే ఎంబెడ్డెడ్‌ వాటర్‌ మార్క్‌ సౌండ్లను గుర్తిస్తాయి. ఈ వాటర్‌ మార్క్‌ సౌండ్లు మన చెవులకు వినిపించవు. కానీ ఆ పరికరాలు మాత్రం గుర్తిస్తాయి. దీంతో ఆ పరికరాలు ఆ సౌండ్లను గుర్తించి అందుకు తగిన విధంగా ప్రోగ్రామ్‌ డేటాను జనరేట్‌ చేసి పైన చెప్పిన బార్క్‌ సంస్థకు ఇస్తాయి. వారు ఆ డేటాను విశ్లేషించి ఏ టీవీ చానల్‌ను జనాలు ఎక్కువగా చూస్తున్నారు, ఏ ప్రోగ్రామ్‌ను వారు ఎక్కువగా చూస్తున్నారు అనే డేటాను టేబుల్‌ రూపంలో ఇస్తారు.

అయితే ఈ రేటింగ్స్‌ డేటా ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే చానల్‌ లేదా ఒకే ప్రోగ్రామ్‌ టాప్‌లో ఉండదు. ఎందుకంటే.. ఉదాహరణకు.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు వస్తున్నాయి కదా.. కనుక సహజంగానే ఆ మ్యాచ్‌లను ప్రసారం చేసే టీవీ చానల్‌నే ఈ సీజన్‌లో ఎక్కువగా చూస్తారు. అది కూడా సాయంత్రం సమయాల్లో కనుక ఆ సమయంలో ఆ చానల్‌ను చూసే వారు ఎక్కువ ఉంటారు కనుక ఆ సమయంలో ఆ చానల్‌కు రేటింగ్‌ ఎక్కువ ఉంటుంది. ఇక మిగిలిన సమయాల్లో ఉండదు, కనుక ఆ చానల్‌కు మిగిలిన సమయాల్లో రేటింగ్‌ మారుతుంది. ఇలా టీఆర్‌పీ రేటింగ్స్‌ ఉంటాయి. అయితే ఈ రేటింగ్స్‌ను మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు పైన చెప్పిన బార్క్‌ సైట్ ను సందర్శించాలి. దీంతో మీకు కూడా మన దేశంలో ఉన్న టీవీ చానల్స్‌, వాటి ప్రోగ్రామ్‌లకు చెందిన టీఆర్‌పీ రేటింగ్స్‌ తెలుస్తాయి. ఇదీ.. టీవీ చానల్ టీఆర్‌పీ రేటింగ్స్‌ వెనుక ఉన్న అసలు కథ.

Tags: trp rating
Previous Post

మీ పొట్ట ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!

Next Post

మ‌హా ప్ర‌ళ‌యం వ‌చ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిక్ర‌మం ఇలా చేస్తాడ‌ట‌..!

Related Posts

హెల్త్ టిప్స్

కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడ‌దా..? కూర్చుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
technology

రాత్రంతా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంచితే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

క‌ర్పూరం బిళ్లను బ్యాగ్‌లో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

ప్రీ డ‌యాబెటిస్ ఉంటే ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగ‌ర్ రాకుండా ఆప‌వ‌చ్చు..!

July 12, 2025
వ్యాయామం

ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తే చాలు.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..

July 12, 2025
హెల్త్ టిప్స్

ఈ పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ గుండె ప‌దిలం..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.