వినోదం

Chiranjeevi : చిరు, దాస‌రి మ‌ధ్య తీవ్ర మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండేవా..? ఎంత‌లా అంటే..?

Chiranjeevi : సినిమా ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టులు, లేదా ద‌ర్శ‌క నిర్మాత‌లు లేకుంటే న‌టులు ద‌ర్శ‌కుల మ‌ధ్య విభేదాలు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే కొన్ని రోజుల వ‌ర‌కే ఆ విభేదాలు త‌ర్వాత అంద‌రు ఒక్క‌టిగా ఉంటారు. టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడిగా దాసరి నారాయణ రావు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు .అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరు.. నటనలో ఎన్నో మెళకువలు పొందిన చిరంజీవి అగ్ర దర్శకులు అందరితో సినిమాలు చేశాడు. అయితే దర్శకుడు దాసరి,మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఒకే ఒక్క సినిమా రావడం విశేషం.

దాసరికి 100వ సినిమాగా లంకేశ్వ‌రుడు చిత్రం రాగా, చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 11 ఏండ్ల తర్వాత దాసరి దర్శకత్వంలో ఈ సినిమా చేశారుమెగాస్టార్ .1989 అక్టోబ‌ర్ 27న ఈ మూవీ విడుద‌లైంది.ఈ సినిమాకి ముందు దాస‌రి-చిరంజీవి కాంబినేష‌న్ మూవీ ఎప్పుడు వ‌స్తుందో అని ఇండస్ట్రీలో టాక్ వినిపించేది. ఎట్ట‌కేల‌కు సినిమా రూపొంద‌గా, ఇందులో డ‌బ్బున్న‌వాళ్ల‌ను దోచుకొని లేనివాళ్ల‌కు పంచిపెట్టే శివ‌శంక‌ర్ గా చిరంజీవి నటించాడు. ఆయ‌న స‌ర‌స‌న రాధ‌ హీరోయిన్ గా చేసింది. స‌త్య‌నారాయ‌ణ‌, మోహ‌న్‌బాబు, ర‌ఘువ‌ర‌న్ విల‌న్ పాత్ర‌లు చేయ‌గా, .చిరంజీవి చెల్లెలిగా రేవతి నటించింది.ఆమె భ‌ర్త‌గా క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి యాక్ట్ చేశారు.

why chiranjeevi and dasari got differences in those days

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి దాసరిలకు మధ్య కొన్ని గొడవలు జరిగాయట‌. దాసరి నారాయణరావు ఆ సమయం లో స్టార్ డైరెక్టర్ కాగా చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అయితే గొడ‌వ‌ల వ‌ల‌న దాసరి నారాయణరావు లేకుండానే చిరంజీవి సినిమాలోని రెండు పాటలు మినహా అన్ని పాటలను చిత్రీక‌రించార‌ట‌. నిర్మాత వడ్డే రమేష్ ఆ తర్వాత ఇద్దరినీ చాలా ప్రయత్నం చేసి కలిపి షూటింగ్ పూర్తి చేయించిన‌ట్టు టాక్. అలా సినిమా పూర్తి అయిన తర్వాత అప్పట్లో ఈ చిత్రాన్ని భారీ రేటుకు అమ్మగా, చిత్రం ఫ్లాప్ టాక్ పొంద‌డ‌తో నిర్మాత‌కు భారీ న‌ష్టాల‌నే మిగిల్చింది.

Admin

Recent Posts