నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యమగోల సినిమా ఒకటి. ఈ మూవీ తాతినేని రామారావు డైరెక్షన్ లో 1977 లో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాను బెంగాల్ లో సూపర్ హిట్ అయినా యమలాయే మనుష్ సినిమా ని రీమేక్ చేశారు. అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెంకటరత్నం ఈ మూవీ ద్వారా నిర్మాతగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాకు మాటలు మరియు అనువాదం చేసింది డి.వి.నరసరాజు. ఈ సినిమాలో యముడి పాత్రలో ఎన్టీఆర్ హీరోగా ఆయన తనయుడు బాలకృష్ణ అని అందరూ అనుకున్నారు. కానీ చివరకు కైకల సత్యనారాయణను యముని గా, హీరోగా సీనియర్ ఎన్టీఆర్ చేశారు.
అయితే ఇందులో బాలకృష్ణను తప్పించింది మాత్రం ఎన్టీఆరే.. మరి ఆయనను ఎందుకు తప్పించారు ఓ సారి చూద్దాం. యమగోల అనే టైటిల్ తో మూవీ చేయాలని దర్శకుడు సి.పుల్లయ్య అనుకున్నారు. అప్పటికే పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవాంతకుడు మూవీ కూడా చేశారు. ఆ సినిమా విజయవంతమైంది. ఈ మూవీని కూడా యమధర్మరాజు టైప్ లోనే చేశాడు. ఇందులో ఎస్.వి.రంగారావు అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సందర్భంలోనే సి.పుల్లయ్య కొడుకు యమగోల కథ డెవలప్ చేసి నరసరాజు కు చెప్పాడు. ఈ కథ ఆయనకు నచ్చకపోవడంతో పక్కన పెట్టారు. ఈ మూవీ టైటిల్ హక్కులను నిర్మాత రామానాయుడు కొన్నారు. ఈ కథ మొత్తం విన్న రామానాయుడికి కొన్ని డౌట్లు ఉండటంతో ఆయన దీన్ని పక్కన పెట్టేసారు. ఇలా 17 సంవత్సరాల పాటు ఈ కథ హక్కులు రామానాయుడు దగ్గరే ఉన్నాయి.
దీని తర్వాత సినిమాటోగ్రాఫర్ గా ఉన్నటువంటి వెంకటరత్నం రామానాయుడు నుండి ఈ మూవీ రైట్స్ ను కొన్నారు. చివరికి రచయిత డి.వి.నరసరాజు కథను ఇంకా డెవలప్ చేశారు. దేవాంతకుడు అనే మూవీ ని ఎన్టీఆర్ తో తీశారు కాబట్టి యమగోల సినిమాలో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ తో చేస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికి బాలకృష్ణ తన సొంత బ్యానర్ పై మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బయట మూవీస్ లో నటించేందుకు ఎన్టీఆర్ కి ఇష్టం లేదు. ఈ ఒక్క కారణం తోనే బాలయ్యని ప్రాజెక్టు నుండి ఎన్టీఆర్ తప్పించేసాడు. చివరకు ఈ సినిమాలో యముడిగా కైకాల సత్యనారాయణ హీరోగా ఎన్టీఆర్ కథానాయికగా జయప్రద చేశారు. దీంతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.