Exercises : ప‌డుకుని ఉండి కూడా ఈ 5 ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌వచ్చు తెలుసా..? త‌్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

Exercises : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. గుండెజ‌బ్బులు, బీపీ, షుగ‌ర్, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వస్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం. అయితే అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకుంటూ రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా మందికి రోజూ వ్యాయామం చేయడం కుద‌ర‌దు.

అలాగే వ్యాయామం చేయ‌డానికి చాలా మంది బ‌ద్ద‌కిస్తారు. ఇలా వ్యాయామం చేయ‌డానికి బ‌ద్ద‌కించే వారు ఇప్పుడు చెప్పే సుల‌భ‌మైన వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. స‌న్న‌టి నాజుకైన న‌డుమును సొంతం చేసుకోవ‌చ్చు. ఈ వ్యాయామాన్ని బెడ్ పైన ఉండి కూడా చాలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకున్న‌ప్ప‌టికి వ్యాయామం చేయ‌డానికి బ‌ద్ద‌కించే వారు పార్శ్వ కాలు లిఫ్ట్ వ్యాయామాన్ని చేయ‌వ‌చ్చు. దీని కోసం ముందుగా ఎడ‌మ వైపు తిరిగి ప‌డుకోవాలి. ఎడ‌మ కాలు పాదాన్ని నేల‌పై ఉంచాలి. అలాగే ఎడ‌మ‌చేతిపై బ‌రువు వేసి శ‌రీరాన్ని పైకి లేపాలి. త‌రువాత కుడి కాలును పైకి కిందికి క‌దుపుతూ ఉండాలి. ఇలా 20 నుండి 30 సార్లు చేసిన త‌రువాత మ‌రోవైపుకు మారాలి.

do these 5 Exercises while lying down for weight loss
Exercises

త‌రువాత కుడికాలు పాదాన్ని కింద ఉంచి ఎడ‌మ కాలును పైకి కిందికి అనాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే హ్యాపీ బేబి భంగిమ‌ను చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. చిన్న పిల్ల‌లు నేల‌పై ప‌డుకుని కాళ్ల‌ను పైఎత్తి పాదాల‌ను చేత్తో ప‌ట్టుకున్న‌ట్టు ప‌ట్టుకోవాలి. దీని కోసం వీపు భాగాన‌క్ని, త‌ల‌పై ఉంచి కాళ్ల‌ను పైకెత్తాలి. త‌రువాత చేత్తో పాదాల‌ను ప‌ట్టుకోవాలి. మ‌న రెండు పాదాలు కూడా ఆకాశాన్ని చూస్తున్న‌ట్టు ఉండాలి. ఇలా పాదాలను చేతుల‌తో ప‌ట్టుకుని కాళ్ల‌ను వీలైనంత దూరంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు గ్లూట్ వంతెన‌లు వేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. దీని కోసం ముందుగా నేల‌పై నిటారుగా ప‌డుకోవాలి.

త‌రువాత పాదాల‌ను పూర్తిగా నేల‌పై ఉంచాలి. ఛాతి, త‌ల భాగాన్ని కూడా నేలపై ఉచి న‌డుముభాగాన్ని పైకి లేపాలి. ఇలా 20 నుండి 30 సెక‌న్ల పాటు అలాగే ఉండి మ‌రాలా కిందికి అనాలి. ఇలా న‌డుము భాగాన్ని పైకి కిందికి అంటూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌న‌లో చాలా మందికి ప్లాంక్స్ వ్యాయామం గురించి తెలిసే ఉంటుంది. దీనికోసం నేల‌పై బోర్లా ప‌డుకోవాలి. త‌రువాత రెండు మోచేతుల‌ను, అలాగే కాళ్ల వేళ్ల‌పై బ‌రువు వేసి పూర్తి శ‌రీరాన్ని పైకి లేపాలి. ఇలా 30 సెక‌న్ల నుండి నిమిషం పాటు అలాగే ఉండి ఆ త‌రువాత శ‌రీరాన్ని నేల‌కు ఆనివ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా శ‌రీర బ‌రువు త‌గ్గుతుంది. ఇలాంటి వ్యాయామాలు చేయ‌డం వల్ల చాలా సుల‌భంగా ఎక్కువ క‌ష్ట‌ప‌డ‌కుండా మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. నాజుకైనా న‌డుమును సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts