Night Walk : రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం వేగంగా న‌డిస్తే మంచిదా.. లేక నెమ్మ‌దిగా న‌డ‌వాలా..?

Night Walk : రాత్రిపూట భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేసే వాళ్ల‌ని మనం చాలా మందినే చూస్తూ ఉంటాము. రోజూ రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత ప‌డుకోవ‌డం కంటే వాకింగ్ చేసిన త‌రువాత ప‌డుకోవ‌డం మంచిద‌ని ఇది చాలా మంచి అల‌వాట‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే ప‌డుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా త‌లెత్తుతాయి. క‌నుక భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని, భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం చాలా మంచిద‌ని వారు చెబుతున్నారు. అయితే భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ ఎలా చేయాలి.. అనే సందేహం కూడా మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. కొంద‌రు వేగంగా న‌డుస్తారు.. కొంద‌రు నెమ్మ‌దిగా న‌డుస్తారు.. అస‌లు రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ ఎలా చేయాలి.. ఇలా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట భోజ‌నం చేసిన వెంట‌నే వాకింగ్ చేయ‌కూడ‌దు. భోజ‌నం చేసిన ఒక గంట త‌రువాత వాకింగ్ చేయాలి. అలాగే ఈ వాకింగ్ వేగంగా కూడా చాలా నెమ్మ‌దిగా న‌డుస్తూ చేయాలి. వేగంగా న‌డ‌వ‌డం వ‌ల్ల క‌డుపులో నొప్పి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాగే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత క‌నీసం అర‌గంట నుండి ఒక గంట వ‌ర‌కు నెమ్మ‌దిగా న‌డుస్తూ వాకింగ్ చేయ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత న‌డ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. అలాగే శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

Night Walk we have to do fast or slow which one is better for health
Night Walk

ఇన్పెక్ష‌న్ లు, సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డకుండా ఉంటాము. అలాగే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత న‌డ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుద‌ల అవుతుంది. ఈ హార్మోన్ ను మెద‌డుకు ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. దీంతో మన‌కు నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ఈ విధంగా రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే భోజ‌నం చేసిన త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో లేదా జీవిత భాగ‌స్వామితో క‌బుర్లు చెప్పుకుంటూ న‌డ‌వ‌డం వ‌ల్ల శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts