హిందీ క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ తెలుసా.. నెయ్యి డైట్‌తో 15 కిలోలు తగ్గింది..

అధిక బ‌రువు త‌గ్గడం అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. కొంద‌రు అధిక బ‌రువు త‌గ్గ‌లేక‌పోతున్నారు. అయితే అలాంటి వారు వినూత్న రీతిలో బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది. కొంద‌రు సెల‌బ్రిటీలు ఈ విధంగానే ప్ర‌య‌త్నిస్తూ బ‌రువు త‌గ్గుతున్నారు. వారిలో క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ ఒక‌రు.

హిందీ క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ తెలుసా.. నెయ్యి డైట్‌తో 15 కిలోలు తగ్గింది..

తెలుగు ప్రేక్ష‌కులు చాలా మందికి హిందీ క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ గురించి తెలియ‌దు. కానీ ఆమె క‌పిల్ శ‌ర్మ షోలో పాపుల‌ర్‌. అలాగే డ్యాన్స్ దీవానే 3 షోలోనూ క‌నిపించి అల‌రిస్తోంది. అయితే ఆమె అధికంగా బ‌రువు ఉండేది. కానీ ఆమె ఇటీవ‌ల 15 కిలోల బ‌రువు త‌గ్గింది. 91 కిలోలు ఉన్న ఆమె నెయ్యి డైట్‌తో 15 కిలోలు త‌గ్గి 76 కిలోల‌కు చేరుకుంది. ఈ విష‌యాన్ని ఓ కార్య‌క్ర‌మంలో ఆమే స్వ‌యంగా వెల్ల‌డించింది.

భార‌తీ సింగ్ త‌న వెయిట్ లాస్ గురించి ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకుంది. తాను మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంట‌ల మ‌ధ్యే ఆహారం తింటాన‌ని, రాత్రి 7 దాటితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆహారాల‌ను ముట్ట‌న‌ని చెప్పింది. అలాగే నెయ్యిని ఎక్కువ‌గా తీసుకుంటాన‌ని ఆమె తెలియ‌జేసింది. ఆహారాల‌పై నాలుగు టీస్పూన్ల నెయ్యి వేసి తింటాన‌ని చెప్పింది. ఆమె ఆ విధంగా నెయ్యి వేస్తున్న ఓ వీడియోను కింద చూడ‌వ‌చ్చు. ఈ వీడియోను జాస్మిన్ భాసిన్ షేర్ చేసింది.

గ‌తంలో ఆస్త‌మా, డ‌యాబెటిస్ త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేసేవని భార‌తీ సింగ్ తెలిపింది. కానీ ఈ డైట్ వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో అవి కంట్రోల్‌లో ఉన్నాయ‌ని తెలిపింది. ఆస్త‌మా ఇబ్బంది పెట్ట‌డం లేద‌ని, షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లోనే ఉన్నాయ‌ని తెలియ‌జేసింది.

అయితే నిజానికి నెయ్యి అనేది బ‌రువును పెంచ‌దు, త‌గ్గిస్తుంది. దాన్ని రోజూ స‌రైన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆమె ఆహారం తీసుకునే స‌మ‌యాల‌ను బ‌ట్టి ఆమె ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌ను పాటిస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అంటే రోజులో కొన్ని గంట‌ల స‌మ‌యంలోనే తినాల్సిన ఆహారాల‌ను తినాలి. త‌రువాత ఎక్కువ సేపు జీర్ణాశ‌యానికి రెస్ట్ ఇవ్వాలి. ఈ క్ర‌మంలో ఆమె మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు.. అంటే.. 7 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తింటుంది. మిగిలిన 17 గంట‌లు జీర్ణాశ‌యానికి రెస్ట్ ఇస్తుంది. దీంతో బ‌రువు త‌గ్గుతారు. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది బ‌రువు త‌గ్గేందుకు చాలా సుల‌భ‌మైన ప్ర‌క్రియ‌. అందువ‌ల్లే వైద్యులు సైతం దీన్ని సిఫార‌సు చేస్తుంటారు.

అయితే ఎవ‌రైనా స‌రే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించాలంటే వారు ముందుగా డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవ‌డం మేలు. మందులు మింగేవారు క‌చ్చితంగా డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కే ఈ విధంగా చేయాలి. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఉత్త‌మ ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts