మార్కెట్‌లో మనకు రకరకాల హెల్త్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరి స్థోమతకు అనుగుణంగా వారు ఆయా ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయితే కింద చిత్రంలో ఇచ్చిన వస్తువు గురించి మీకు తెలుసా ? దీన్ని హెడ్ మసాజర్ అంటారు. కొందరు స్కాల్ప్ మసాజర్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
స్కాల్ప్ మసాజర్‌తో తలపై సులభంగా మసాజ్ చేసుకోవచ్చు. ఇది అనేక రకాల సైజ్‌లలో వస్తుంది. ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయంపై శాస్త్రీయంగా ఇంకా నిరూపణ కానప్పటికీ ఇది కొన్ని రకాల బెనిఫిట్స్ ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
స్కాల్ప్ మసాజర్ తో మసాజ్ చేయడం వల్ల తలపై రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో అక్కడ ఉండే దుమ్ము, ధూళి పోతాయి. చుండ్రు తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా మెరుగు పడుతుంది.
జుట్టుకు రక్త సరఫరా సరిగ్గా ఉండకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తుంటాయి. కనుక స్కాల్ప్ మసాజర్ ను ఉపయోగిస్తే జుట్టుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో పోషకాలు అందుతాయి. ఫలితంగా జుట్టు సమస్యలు పోతాయి.
స్కాల్ప్ మసాజర్ ను ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. హాయిగా ఉంటారు.