కోవిడ్‌ నుంచి కోలుకున్నాక చాలా మందిలో వస్తున్న జుట్టు రాలే సమస్య.. ఈ విధంగా బయట పడవచ్చు..!

కరోనా వచ్చి తగ్గిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తోంది. అయితే ఇందుకు నిపుణులు కూడా సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు.

కోవిడ్‌ నుంచి కోలుకున్నాక చాలా మందిలో వస్తున్న జుట్టు రాలే సమస్య.. ఈ విధంగా బయట పడవచ్చు..!

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటుందని, దీంతోపాటు పోషకాహార లోపం కూడా వస్తుందని.. అందుకనే జుట్టు రాలే సమస్య వస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే బయోటిన్‌ ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

అనేక బి విటమిన్లలో బయోటిన్‌ ఒకటి. దీన్నే విటమిన్‌ బి7 అంటారు. ఇది నీటిలో కరుగుతుంది. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాల్సిందే. బయోటిన్‌ మన శరీరంలో కెరాటిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.

రోజుకు మనకు 30 మైక్రోగ్రాముల వరకు బయోటిన్‌ అవసరం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 35 మైక్రోగ్రాముల వరకు బయోటిన్‌ కావాలి. అందువల్ల డాక్టర్‌ సూచనతో బయోటిన్‌ ట్యాబ్లెట్లను తీసుకోవచ్చు. బయోటిన్‌ మనకు పలు ఆహారాల ద్వారా కూడా లభిస్తుంది.

కోడిగుడ్డులో ఉండే పచ్చనిసొన, మాంసం, లివర్‌, కిడ్నీ, తృణ ధాన్యాలు, బాదంపప్పు, వేరుశెనగలు, పీకన్‌ నట్స్‌, వాల్‌ నట్స్, వెన్న, కాలిఫ్లవర్‌, పుట్ట గొడుగులు, సోయాబీన్, పప్పు దినుసులు, అరటి పండ్లు, రాస్ప్‌ బెర్రీలలో బయోటిన్‌ అధికంగా లభిస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల బయోటిన్‌ లభిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఇక జుట్టు రాలే సమస్యకు ఒత్తిడి కూడా కారణమతువుంది. కనుక రోజూ మనకు ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు గాను యోగా, ధ్యానం సహాయ పడతాయి. ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలను చదవడం, ప్రకృతిలో రోజూ కొంత సేపు గడపడం చేస్తే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

బయోటిన్‌ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో పలు జీవక్రియలు కూడా సరిగ్గా నిర్వర్తించబడతాయి. వాపులు తగ్గుతాయి. షుగర్‌ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది.

Share
Admin

Recent Posts