ఆలుగడ్డలను చాలా మంది తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. వాటితో కొందరు వేపుళ్లు చేసుకుంటారు. కొందరు టమాటాలతో కలిపి వండుతారు. ఇంకొందరు కిచిడీ వంటి వాటిల్లో వేస్తుంటారు. అయితే సాధారణంగా చాలా మంది వీటిని తరచూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటారు. కానీ కింద తెలిపిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే..
గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నవారు బంగాళాదుంపలను తినరాదు. తింటే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఇప్పటికే ఆయా సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మానేయాలి.
ఆలుగడ్డల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా ఎక్కువ. అంటే తిన్న వెంటనే ఇవి గ్లూకోజ్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డలకు దూరంగా ఉండాలి.
హై బ్లడ్ ప్రెషర్ సమస్య ఉన్నవారు వీటిని తినరాదు. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. ఆలుగడ్డలను తినడం వల్ల హై బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది. దీంతో హైబీపీ సమస్య ఇంకా తీవ్రతరం కాకుండా ఉంటుంది.
బరువు పెరగాలనుకునే వారు ఆలుగడ్డలను తినవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినకూడదు. ఆలుగడ్డలను తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. కనుక బరువు తగ్గాలని డైట్ పాటించే వారు వీటికి దూరంగా ఉంటే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365