అసలే వర్షాకాలం. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వ్యాధి వస్తుందో తెలియదు. అనారోగ్యాలకు ఈ సీజన్ పుట్టినిల్లు. అందువల్ల మిగిలిన సీజన్ల కన్నా ఈ సీజన్లోనే కాస్తంత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దోమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. వాటిని తరిమేసే ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలోనే కింద తెలిపిన మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు పారిపోతాయి. మరి ఆ మొక్కలు ఏమిటంటే..
1. సిట్రొనెల్లా గ్రాస్
దోమలను తరిమికొట్టడంలో ఈ గ్రాస్ బాగా పనిచేస్తుంది. దీన్నే లెమన్ గ్రాస్ అని లేదా నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. నిమ్మలాగే ఈ ఆకులు వాసన వస్తాయి. ఆ వాసన దోమలను తరిమేస్తుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవచ్చు.
2. తులసి
తులసి మొక్కలను ఇంట్లోనూ పెంచుకోవచ్చు. దీని వల్ల దోమలు, ఈగలు పారిపోతాయి.
3. బంతి పూల మొక్క
బంతి పువ్వుల మొక్కలు మన తోటలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాటిని ఇంట్లో పెడితే దోమలను తరిమికొట్టవచ్చు.
4. రోజ్మేరీ
రోజ్ మేరీ మొక్క అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని మసాలా దినుసులతోపాటు వంటల్లో వేస్తుంటారు. ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ఉండే దోమలను తరిమికొట్టవచ్చు.
5. పుదీనా
పుదీనా మొక్కలు సహజసిద్ధమైన మస్కిటో రీపెల్లెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. వీటిని ఇంట్లో పెంచుకుంటే దోమలు పారిపోతాయి. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడవచ్చు.