మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఈ రెండు కొలెస్ట్రాల్స్ శరీరంలో తగిన స్థాయిలో ఉండాలి. అయితే మనం తినే ఆహార పదార్థాలు, పాటించే అస్తవ్యస్తమైన జీవన విధానం, మనకు కలిగే అనారోగ్య సమస్యల వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చేందుకు కారణమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే… ఛాతిలో ఎప్పుడూ నొప్పిగా అనిపించడం, వికారంగా ఉండడం, తీవ్రమైన అలసట, చిన్నపనికే తీవ్రంగా అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మెడ, దవడలు, పొట్ట పై భాగంలో, వెనుక భాగంలో నొప్పి, శరీరం బాగా చల్లగా ఉండడం, స్పర్శను కోల్పోయినట్లు అనిపించడం.. వంటివన్నీ ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉందని చెప్పేందుకు సూచనలు. ఈ సూచనలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. అలాగే కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో ఎల్‌డీఎల్ తగ్గి హెచ్‌డీఎల్ పెరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
1. బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ బాదంపప్పును తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ 3 నుంచి 19 శాతం వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల బాదంపప్పును తరచూ తీసుకోవాలి.
2. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు సోయాబీన్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రోజూ ఒక కప్పు సోయాను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
3. అవిసె గింజల్లో సాల్యుబుల్ ఫైబర్, లిగ్నన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
4. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎల్‌డీఎల్ తగ్గుతుంది. రోజూ పరగడుపునే 1 టీస్పూన్ మెంతులను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
5. ధనియాల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఆయుర్వేద ఔషధంగా ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ధనియాలను రోజూతీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రోజూ 2 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది.
6. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గుతుంది. రోజూ పరగడుపునే 2-4 వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే నమిలి తినాలి. లేదా తేనెతోనూ తీసుకోవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ తగ్గడమే కాక గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
7. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపర్ కొలెస్టరొలెమియా, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. తులసి ఆకులను రోజూ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోవే కొలెస్ట్రాల్ కరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే కొన్ని తులసి ఆకులను తింటున్నా లేదా తులసి ఆకులతో తయారు చేసిన డికాషన్ తాగుతున్నా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
8. పాలకూరలో లుటీన్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతుంది. రోజూ ఒక కప్పు పాలకూరను తింటున్నా లేదా ఒక గ్లాస్ పాలకూర జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది.
9. కొలెస్ట్రాల్‌ను తగ్గించే సూపర్ ఫ్రూట్‌గా నారింజ పండ్లను భావిస్తారు. రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో నారింజ పండ్లను తినాలి. లేదా ఇంట్లో తయారు చేసిన జ్యూస్‌ను తాగవచ్చు. దీని వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
10. మనం తినే ఆహారాల ద్వారా శరీరం కొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం కొలెస్ట్రాల్‌ను సరిగ్గా శోషించుకోదు. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రోజూ 2-3 కప్పుల గ్రీన్ టీని తాగితే ఫలితం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365