Himalayan Garlic : భారతీయుల వంట ఇళ్లలో అనేక రకాల మసాలా దినుసులు, పదార్థాలు ఉంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయి. అవి మనల్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే వెల్లుల్లి గురించి సహజంగానే అందరికీ తెలుసు. కానీ హిమాలయన్ వెల్లుల్లి అని ఒక వెరైటీ ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఇది కొలెస్ట్రాల్, వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జమ్మూ వెల్లుల్లి అని పిలుస్తారు.
హిమాలయన్ వెల్లుల్లి హిమాలయాల్లో ఏడాదికి ఒకసారి లభిస్తుంది. దీని వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వెల్లుల్లిలో అనేక పోషకాలు కూడా ఉంటాయి.
మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఏ రోజు కారోజు పెరిగిపోతుంటాయి. కానీ ఆరోగ్యవంతుల్లో అవి సరైన స్థితిలోనే ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారిలోనే వాటి లెవల్స్ పెరుగుతాయి. అలాంటి వారు హిమాలయన్ వెల్లుల్లిని తింటే కొలెస్ట్రాల్ లెవల్స్, ట్రై గ్లిజరైడ్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. హిమాలయన్ వెల్లుల్లిని తింటే దగ్గు, జలుబు నయం అవుతాయి. అలాగే ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఈ వెల్లుల్లిలో అలినేజ్, అలీన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే మరో శక్తివంతమైన అల్లిసిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
వెల్లుల్లిలో డైఅలైల్ ట్రై సల్ఫైడ్ అనే ఆర్గానో సల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అందువల్ల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. రోజుకు 2-3 హిమాలయన్ వెల్లుల్లి రెబ్బలను తరచూ తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళం బి విటమిన్లతో కలిసి క్లోమం ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
ఈ విధంగా హిమాలయన్ వెల్లుల్లిని రోజూ తింటుంటే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.