Categories: Featured

మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తింటే త్వరగా జీర్ణం అయ్యేందుకు ఏం చేయాలి ?

సాధారణంగా మనం ఏ ఆహారం తిన్నా, ద్రవాలను తాగినా అవి జీర్ణం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఘనాహారం అయితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అదే ద్రవాహారం అయితే తక్కువ సమయం పడుతుంది. మరి మాంసాహారం సంగతేమిటి ? మాంసాహారం తింటే జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తిన్నాక అది త్వరగా జీర్ణం అవ్వాలంటే అందుకు ఏం చేయాలి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

how much time it will take to digest non veg foods what to do for them

మాంసాహారం అనేక కాదు, ఏ ఆహారం అయినా సరే జీర్ణం అవ్వాలంటే అది వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఏ ఆహారం తిన్నా త్వరగా జీర్ణం చేసుకోగలరు. వ్యక్తిని బట్టి ఆహారం జీర్ణం అయ్యే సమయం మారుతుంది. కానీ వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం మనం తినే మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయమే పడుతుంది. అందులో ప్రోటీన్లు, కొవ్వులు రెండూ ఉంటాయి. కనుక అవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. మాంసాహారం జీర్ణం అయ్యేందుకు సుమారుగా 2 నుంచి 4 రోజుల వరకు సమయం పడుతుంది. జీర్ణశక్తి బాగా ఉంటే 24 గంటల్లోనే మాంసాహారం జీర్ణమవుతుంది. ఇక మాంసాహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మాంసాహారాన్ని కొందరు మార్కెట్‌ నుంచి తేగానే శుభ్రం చేసి అలాగే వండుతారు. కానీ అలా కాకుండా దాన్ని సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు మారినేట్‌ చేయాలి. దీని వల్ల మాంసం మృదువుగా మారుతుంది. త్వరగా ఉడుకుతుంది. దాన్ని మనం తిన్నా గానీ త్వరగా జీర్ణమవుతుంది.

2. కొందరు ఆహారాన్ని వేగంగా నమిలి తింటారు. కానీ అలా కాదు. మనం ఆహారాన్ని ఎంత నెమ్మదిగా తింటే అంత మంచిది. ఎక్కువ సేపు ఆహారాన్ని నమిలితే జీర్ణాశయంలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

3. మాంసాహారం తిన్నవారు పైనాపిల్‌ పండ్లను తింటే మాంసాహారం త్వరగా జీర్ణమవుతుంది. పైనాపిల్‌ పండ్లలో ఉండే బ్రొమెయిలిన్‌ అనబడే ఎంజైమ్‌ మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

4. మాంసాహారం తిన్న తరువాత బొప్పాయి పండ్లను తినవచ్చు. వాటిల్లో ఉండే పపైన్‌ అనబడే ఎంజైమ్‌ ప్రోటీన్లను జీర్ణం చేసేందుకు సహాయ పడుతుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలు రాకుండా ఉంటాయి.

5. మాంసాహారం తిన్న తరువాత కొందరు పెరుగు తినరు. కానీ మాంసాహారం తిన్నాక నిజానికి పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి. ఇవి ప్రొ బయోటిక్‌ ఆహారాలు. ఇవి మన జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను వృద్ధి చేస్తాయి. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts