మ‌న‌కైతే ఉచిత‌మే.. అమెరికాలో రూ.1800 పెట్టి ఒక్కో వేప పుల్ల‌ను కొంటున్నారు..

ఎన్నో వంద‌ల సంవత్స‌రాల నుంచి భార‌తీయులు దంతాల‌ను తోముకునేందుకు వేప పుల్ల‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. వేప పుల్లల‌తో దంతాల‌ను తోముకుంటే దంతాలు ఎంతో దృఢంగా ఉంటాయి. వేప‌లో ఉండే యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు నోట్లోని బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో నోటి దుర్వాస‌న రాదు. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు.

మ‌న‌కైతే ఉచిత‌మే.. అమెరికాలో రూ.1800 పెట్టి ఒక్కో వేప పుల్ల‌ను కొంటున్నారు..

అందువ‌ల్లే మ‌న పూర్వీకుల కాలం నుంచి దంతాల‌ను తోముకునేందుకు వేప పుల్ల‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటే నోరు కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మ‌న దేశంలో ఎక్క‌డికి వెళ్లినా వేప పుల్ల‌లు విరివిగా ల‌భిస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణాల్లో వేప‌ పుల్ల‌లు మ‌న‌కు ఎక్క‌డైనా చెట్ల‌కే ల‌భిస్తాయి. ఉచితంగానే అవి అందుబాటులో ఉంటాయి. న‌గ‌రాల్లో అయితే రూ.5 నుంచి రూ.10కి ఒక్కో పుల్ల‌ను విక్ర‌యిస్తారు. అయితే అమెరికాలో మాత్రం ఒక వేప పుల్ల‌ను ఎంతకు విక్ర‌యిస్తున్నారో తెలుసా ? అక్ష‌రాలా రూ.1800. అవును, నిజ‌మే.

అమెరికాలో వేప పుల్ల‌ల‌ను ఆర్గానిక్ టూత్ బ్ర‌ష్‌గా మార్చి ఒక్కో పుల్ల‌ను 24.63 డాల‌ర్ల‌కు అమ్ముతున్నారు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.1800 అన్న‌మాట‌. మ‌న ద‌గ్గ‌ర వేప పుల్లలు ఉచితంగానే ల‌భిస్తాయి. కానీ అమెరిక‌న్లు మాత్రం వాటిని డ‌బ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అమెరికాలో వేప పుల్ల‌ల‌ను నీమ్ ట్రీ ఫామ్స్ అనే ఈ-కామ‌ర్స్ కంపెనీ విక్ర‌యిస్తోంది. వాటిని సుంద‌రంగా ముస్తాబు చేసిన ప్యాక్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు.

ఏది ఏమైనా మ‌న‌కు మాత్రం అవి ఉచితంగానే ల‌భిస్తున్నాయి క‌దా. క‌నుక వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోమ‌డం ఇప్పుడే ప్రారంభించండి. విదేశీయుల‌కు వాటి విలువ తెలిసింది క‌నుక‌నే అంత ధ‌ర పెట్టి మ‌రీ వాటిని కొంటున్నారు. మ‌న‌కు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి క‌నుక ఇప్పుడే వాటిని వాడ‌డం ప్రారంభించండి. దంతాలు, చిగుళ్లు, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోండి..!!

Share
Admin

Recent Posts