జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, థైరాయిడ్, జన్యు పరమైన సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన ఆ బరువును తగ్గించుకునేందుకు అష్ట కష్టాలు పడుతుంటారు. అయితే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక కొవ్వు కరిగించి బరువును తగ్గించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వును కరిగించడంలో బీన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. నిత్యం వీటిని ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తీసుకోవాలి. ఇవి జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంచుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కొవ్వును శరీరంలో నిల్వ కాకుండా చూస్తుంది. దీంతోపాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బీన్స్‌ను తరచూ తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
నిత్యం ఉదయం అల్పాహారంలో ఓట్స్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది. ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
ఇందులో విటమిన్ సి, కె, ఫోలేట్, ఎ, బి6, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తరచూ వీటిని ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తింటే త్వరగా కొవ్వు కరుగుతుంది.
బ్రౌన్ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది. నిత్యం బ్రౌన్ రైస్‌ను తింటే త్వరగా కొవ్వు కరగడంతోపాటు అధిక బరువు తగ్గుతారు.
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును నిల్వ చేయనీయవు. ఫలితంగా అధిక బరువు కూడా తగ్గవచ్చు. అలాగే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
నిత్యం 3 పూటలా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.
నిత్యం బాదం పప్పును ఓ గుప్పెడు మోతాదులో తింటే అధిక బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. బాదంపప్పు మెటబాలిజంను పెంచుతుంది. అందుకే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును తగ్గిస్తాయి. కొవ్వును కరిగిస్తాయి. మెటబాలిజంను పెంచుతాయి.
టమాటాల్లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నిత్యం 2 టమాటాలను తింటే కొవ్వును కరిగించడమే కాక అధిక బరువును తగ్గించుకోవచ్చు.
నిత్యం మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చని కెనడాకు చెందిన పరిశోధకులు తేల్చి చెప్పారు. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించడంలో మిరపకాయలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ మేరకు సైంటిస్టుల ఈ విషయాన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు.