Stress : ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను సుల‌భంగా తగ్గించుకోండి.. వీటిని తీసుకోండి..!

Stress : ఒత్తిడి అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. రోజువారీ కార్య‌క‌లాపాల్లో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది మ‌న మాన‌సిక ఆరోగ్యంపైనే కాకుండా.. శారీర‌క ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపిస్తోంది. అందువ‌ల్ల ఒత్తిడిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే..

Stress reducing health tips take these foods

1. తులసి

తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తులసిని ఉపయోగిస్తుంటారు. కానీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా తులసి ఉపయోగపడుతుంది. ప‌ని చేసి ఇంటికి వ‌చ్చాక తులసి ఆకులను నీటిలో మరిగించి అందులో కొద్దిగా నిమ్మ ర‌సం, తేనె కలిపి తాగాలి. దీని వ‌ల్ల ఒత్తిడి త‌గ్గిపోతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

2. అశ్వగంధ

ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఒత్తిడిని త‌గ్గించి మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తుంది. అందుకు గాను రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో అర టీస్పూన్ అశ్వ‌గంధ పొడిని క‌లిపి తాగాలి. దీంతో మ‌న‌స్సుకు హాయిగా ఉంటుంది. ఒత్తిడి త‌గ్గి నిద్ర బాగా ప‌డుతుంది.

3. గ్రీన్ టీ

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనే కాదు, ఒత్తిడిని త‌గ్గించేందుకు కూడా గ్రీన్ టీ స‌హాయ ప‌డుతుంది. గ్రీన్ టీలో ఎల్‌-థియెనిన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల రోజుకు రెండు క‌ప్పుల గ్రీన్‌టీని తాగుతుంటే.. ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. బాదం, వాల్‌న‌ట్స్‌

బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్ ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మెదడుకు బలాన్ని ఇస్తాయి. రోజంతా పనిచేసిన తర్వాత వచ్చే అలసటను త‌గ్గిస్తాయి. రోజూ గుప్పెడు మోతాదులో బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్ ను తింటుండాలి. దీనివ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

Share
Editor

Recent Posts