వర్షాకాలంలో సహజంగానే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరంతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తుంటాయి. అయితే ఈ సీజన్‌లో మనం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. ఇక ఈ సమయంలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ పదార్థాలను తీసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటంటే..
తేనె సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
వేప ఆకులు కూడా సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తాయి. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. లేదా ఉదయాన్నే పరగడుపునే కొన్ని వేపాకులను అలాగే నమిలి తినవచ్చు. లేదా వేపాకుల పొడిని కూడా తీసుకోవచ్చు. దీంతో బాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
వెల్లుల్లి కూడా సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజూ పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి తింటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
పసుపులో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. ఈ సీజన్‌లో దీన్ని కచ్చితంగా తీసుకోవాలి. పసుపును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. లేదా రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగవచ్చు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
అల్లంలోనూ సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసంను సేవిస్తుండాలి. లేదా రోజుకు 2 సార్లు అల్లం వేసి మరిగించిన నీటిని తాగుతుండాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365