Categories: Featured

రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలి.. ఎందుకంటే..?

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు.. దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటే వాటికి సంబంధించిన ఇతర ఏ సమస్యలూ రాకుండా ఉంటాయి. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ నిత్యం రెండు సార్లు దంతాలను తోముకోవాల్సి ఉంటుంది. దీని వల్ల దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

we must brush our teeth twice daily know the reason

రోజూ దంతాలను రెండు సార్లు తోమాలి

1. మనం తినే ఆహారాలు, తాగే పానీయాల వల్ల నోట్లో ఎప్పుడూ బాక్టీరియా పేరుకుపోతుంది. దీంతో నోటి దుర్వాసన వస్తుంది. నోరు తాజాగా ఉండదు. కనుక నోరు తాజాదనం కావాలంటే దంతాలను రెండు పూటలా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

2. దంతాల్లో ఎప్పటికప్పుడు మనం తినే ఆహారాలకు చెందిన వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. వాటి వల్ల చిగుళ్ల సమస్యలు వస్తాయి. చిగుళ్లు వాపులకు గురవుతారు. రక్తస్రావం కూడా జరుగుతుంది. దీన్ని నివారించాలంటే నిత్యం రెండు సార్లు దంతాలను తోముకోవాల్సి ఉంటుంది.

3. దంతాలు ఎల్లప్పుడూ తెల్లగా మెరవాలని కోరుకునేవారు నిత్యం రెండు సార్లు దంతాలను తోమాలి. లేదంటే దంతాలపై పాచి పేరుకుపోతుంది. దంతాలు పచ్చగా కనిపిస్తాయి.

4. మనం మేల్కొని ఉన్నప్పుడు మన నోట్లో ఎక్కువ ఉమ్మి ఉత్పత్తి అవుతుంది. ఇది దంతాలపై ఒక సురక్షితమైన పొరను ఏర్పాటు చేస్తుంది. కనుక దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే రాత్రి పూట మన నోట్లో ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు వస్తాయి. దీన్ని నివారించాలంటే రాత్రి పూట దంతాలను తోముకోవాల్సి ఉంటుంది.

5. దంతాలు, నోరు ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. దంత సమస్యలు ఉన్నవారికి డయాబెటిస్‌, హార్ట్‌ స్ట్రోక్స్‌, ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఎవరైనా సరే దంతాలను, నోటిని, చిగుళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు నిత్యం రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

Share
Admin

Recent Posts