ఇంట్లో తయారు చేసిన ఊరగాయలను తరచూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

భారతీయులకు ఊరగాయలు అంటే మక్కువ ఎక్కువ. పచ్చళ్లను చాలా మంది తింటుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండు లేదా మూడు ఊరగాయలు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. కొందరికైతే ఊరగాయతో భోజనం చేయకపోతే తిన్నట్లు ఉండదు. ఇక ఊరగాయలను అనేక రకాల కూరగాయలతో పెట్టవచ్చు. కొందరు పండ్లతోనూ ఊరగాయలను పెడతారు. క్యారెట్‌, మామిడి, ఉల్లిపాయలు, నిమ్మ, బీట్‌రూట్‌, మునగకాయలు.. ఇలా రక రకాల ఊరగాయలను పెట్టుకుని చాలా మంది తింటుంటారు. అయితే వీటిని నిత్యం తీసుకోకపోయినా తరచూ స్వల్ప మోతాదులో మాత్రం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

eat home made pickles frequently know why

ఊరగాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. ఊరగాయల్లో విటమిన్‌ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. ఊరగాయల్లో ఉండే విటమిన్‌ ఎ గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుంది.

3. ఊరగాయల్లో ఉండే పోషకాలు కంటి చూపుకు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

4. ఊరగాయల్లోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తాయి.

5. ఊరగాయల్లో ఉండే పొటాషియం నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నాడులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తాయి.

6. ఊరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.

7. ఊరగాయలను పులియబెడతారు. కనుక వాటిల్లో మంచి బాక్టీరియా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

8. కండరాల నొప్పులు ఉన్నవారు ఊరగాయలను తింటే ఫలితం ఉంటుంది.

9. ఊరగాయల్లో ఉండే కాల్షియం శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. వ్యాధులను రాకుండా చూస్తుంది.

బీపీ ఉన్నవారు డాక్టర్‌ సూచన మేరకు ఊరగాయలను తినవచ్చు. ఇక మిగిలిన ఎవరైనా సరే అప్పుడప్పుడు స్వల్ప మోతాదులో ఊరగాయలను తింటే ఆరోగ్యంగానే ఉండవచ్చు. కానీ వీటిని మోతాదకు మించి తీసుకోరాదు. తీసుకుంటే ఆరోగ్యకర ప్రయోజనాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Share
Admin

Recent Posts