తామ్ర జలం (రాగి పాత్రలో నీరు) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

ఆయుర్వేదంలో రాగిని ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. రాగిలో సహజసిద్ధమైన నయం చేసే గుణాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. శరీరాన్ని దృఢంగా ఉండేలా చేస్తాయి. నిత్యం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రాత్రంతా నీటిని ఒక రాగి పాత్రలో నిల్వ ఉంచి ఆ నీటిని మరుసటి రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of drinking tamra jal

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తామ్ర జలం అని పిలుస్తారు. అంటే.. తామ్రంను రాగి అని పిలుస్తారు. అందుకనే ఆయుర్వేదంలో తామ్ర జలం అంటారు. ఇక ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటే…

1. తామ్ర జలాన్ని సేవించడం వల్ల శరీరంలోని మూడు దోషాలు సమతుల్యం అవుతాయి. వాత, పిత్త, దోషాలు సమం అవుతాయి. ఆయుర్వేద ప్రకారం ఈ మూడు దోషాల్లో హెచ్చు తగ్గుల వల్లే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక తామ్ర జలాన్ని సేవించడం వల్ల ఈ మూడు దోషాలు సమతుల్యం అవుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

2. ఆయుర్వేద ప్రకారం నిత్యం ఉదయాన్నే 2 నుంచి 3 గ్లాసుల తామ్ర జలాన్ని సేవిస్తే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

3. తామ్ర జలం చర్మ కణాలను సంరక్షిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది. ముడతలు రావు. వృద్ధాప్య చాయలు కనిపించవు.

4. తామ్ర జలం సేవించడం వల్ల జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, లివర్ తదితర భాగాలు శుభ్రమవుతాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.

5. తామ్ర జలంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. అందువల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

6. తామ్ర జలాన్ని నిత్యం తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

సూచనలు

  • రాగి పాత్రల్లో లేదా బాటిల్స్‌లో సిట్రిక్‌ ఆహారాలు (నిమ్మ, నారింజ మొదలైనవి), పుల్లగా ఉండే పెరుగు తదితర ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ నిల్వ ఉంచరాదు.
  • రాగి పాత్ర లేదా బాటిల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
  • రాత్రి పూట రాగి పాత్ర లేదా బాటిల్‌ను బాగా శుభ్రం చేసి అందులో స్వచ్ఛమైన నీటిని నిల్వ చేయాలి. రాత్రంతా నీటిని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం అవసరం అయిన మేర ఆ నీటిని తాగవచ్చు. లేదా ఆ రోజు మొత్తం కొద్ది కొద్దిగా ఆ నీటిని తాగవచ్చు. ఎలా తాగినా తామ్ర జలం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి.

Share
Admin

Recent Posts