బిర్యానీ.. ఈ పేరు వినగానే ఎవరి నోట్లో అయినా నీళ్లూరతాయి కదా. అవును మరి, బిర్యానీయా మజాకా ! ఎవరి చేతనైనా లొట్టలేసుకుంటూ తినేలా చేసే రుచి దాని సొంతం. అందుకే బిర్యానీ రుచికి చాలా మంది ఫిదా అయిపోతుంటారు. ఇక హైదరాబాద్‌లో లభించే బిర్యానీకైతే మరీ డిమాండ్ ఎక్కువ. విదేశీయులను సైతం మన బిర్యానీ ఆకర్షిస్తుంది. అయితే బిర్యానీ విషయానికి వస్తే హైదరాబాద్‌లో అది ఎక్కడైనా దొరుకుతుంది. కానీ హైదరాబాద్ దాటి మన దేశంలో ఇతర ప్రాంతాలకు వెళితే అక్కడ బిర్యానీ దొరుకుతుందా ? హైదరాబాద్ స్థాయిలో ఆ బిర్యానీ ఉంటుందా ? అంటే.. అవును, ఉంటుంది. కాకపోతే మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ దొరికే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంత టేస్ట్ రాదు. కానీ అలాంటి టేస్ట్ ఉన్న బిర్యానీ కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. మరి ఆ ప్రాంతాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా.
1. కోజికోడ్ (కాలికట్)
కేరళలో ఉన్న ప్రాంతం ఇది. చక్కని ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రాంతం సొంతం. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక ఇక్కడ లభించే రుచులకు కొదువ లేదు. అన్నింటికీ మించి ఇక్కడ లభించే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్‌లా ఉంటుంది. కనుక ఈ ప్రాంతానికి వెళితే హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేయడం మరువకండి.
2. కొచ్చి
ఇది కూడా కేరళలోని ఓ ప్రాంతం. ఇక్కడ కూడా పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ కూడా లభిస్తుంది.
3. కటక్
ఒడిశా రాష్ట్రంలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ లభించే బిర్యానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
4. వయనాడ్
ఈ ప్రాంతం కూడా కేరళలో ఉంది. ఇక్కడి పచ్చని వాతావరణం, అడవులు, వన్యప్రాణులు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి రుచుల్లో బిర్యానీ కూడా చాలా ముఖ్యమైనది.
5. లక్నో
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో చారిత్రక నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లభించే బిర్యానీని పర్యాటకులు ఇష్టంగా తింటారు.
6. అసన్‌సోల్
వెస్ట్‌బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడి పర్యాటక ప్రదేశాలు తక్కువే అయినా అవి వీక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఇక్కడ లభించే బిర్యానీ అన్నా చాలా మంది ఇష్టంగా తింటారు.
7. గుల్బర్గా
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా చారిత్ర ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడి రక రకాల రుచులు పర్యాటకుల నోట్లో నీళ్లూరింపజేస్తాయి. ఇక్కడ లభించే బిర్యానీని పర్యాటకులు ఇష్టంగా తింటారు.
8. ఆగ్రా
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండే ఆగ్రా కూడా చారిత్రక నగరంగా పేరుగాంచింది. ఇక్కడి పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ లభించే బిర్యానీ రుచి చెప్పలేనంత బాగా ఉంటుంది.
9. మైసూర్
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ చారిత్రక ప్రదేశంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు ఎక్కువగా వస్తారు. వారు బిర్యానీ రుచులను ఆస్వాదిస్తారు.