food

నోరూరించే బీట్ రూట్ కుకీస్ ఎలా తయారు చేయాలో తెలుసా?

సాధారణంగా చిన్నపిల్లలకు చాక్లెట్ కుకీస్ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే రుచికి ఆరోగ్యానికి బీట్ రూట్ కుకీస్ ఎంతో మంచిదని చెప్పవచ్చు. మరి ఎంతో రుచికరమైన బీట్ రూట్ కుకీస్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

బీట్ రూట్ తురుము ఒక కప్పు, మైదాపిండి పావు కప్పు, పటిక బెల్లం అర కప్పు, సాల్టెడ్ బటర్100 గ్రాములు, పీనట్ బటర్ 100 గ్రాములు, పాలు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు.

how to make beetroot cookies know the recipe

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలోకి పటిక బెల్లం తీసుకొని అందులోకి సాల్టెడ్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి మైదాపిండి బీట్ రూట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి.అవసరమైతే కొద్దిగా గోరువెచ్చని పాలతో ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. అరగంట తర్వాత పిండిని బయటకు తీసి మనకు ఏ ఆకారంలో నచ్చితే ఆ ఆకారంలో చేసుకుని వాటిపై డ్రైఫ్రూట్స్ వేసి 25 నిమిషాలపాటు ఓవెన్లో 180 డిగ్రీల వద్ద బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్ రూట్ కుకీస్ తయారైనట్లే.

Admin

Recent Posts