Methi Chicken Masala Curry : ధాబా స్టైల్‌లో మేథీ చికెన్ మ‌సాలా కర్రీని ఇలా చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Methi Chicken Masala Curry : మ‌న‌కు ధాబాల్ల‌లో ల‌భించే చికెన్ వెరైటీలల్లో మేథీ చికెన్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. మెంతికూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. చికెన్ తో వెరైటీ వంట‌కాలు చేయాల‌నుకునే వారు ఇలా మేథీ చికెన్ మసాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు. ధాబా స్టైల్ లో మేథీ చికెన్ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మేథీ చికెన్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద మెంతి ఆకు క‌ట్టలు – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌- 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – 3, ఉప్పు – త‌గినంత‌, ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, జీడిప‌ప్పు పేస్ట్ – 2 టీ స్పూన్స్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, బ‌ట‌ర్ – అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్.

Methi Chicken Masala Curry recipe in telugu very tasty with rotis
Methi Chicken Masala Curry

మేథీ చికెన్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మెంతి ఆకుల‌ను వేసి వేయించాలి. మెంతి ఆకులు చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో అర క‌ప్పు నూనె వేసి వేడిచేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాటాల‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి. ఈ చికెన్ ను మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ మెత్త‌గా ఉడికిన త‌రువాత బ‌ట‌ర్, ఫ్రెష్ క్రీమ్, వేయించిన మెంతికూర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మేథీ చికెన్ మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts