సాధారణంగా పాకంపప్పును వివిధ రకాల పదార్థాలతో తయారు చేసుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి పాకంపప్పు ను వేరుశనగ విత్తనాల తో తయారు చేసుకొని తింటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా లభిస్తుంది.మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేరుశనగ పాకంపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
వేరుశనగ విత్తనాలు అరకిలో, బెల్లం రెండు కప్పులు, నీళ్లు తగినన్ని.
తయారీ విధానం
ముందుగా వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. విత్తనాలు చల్లారిన తర్వాత వాటిని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి మనం తీసుకున్న బెల్లంతో పాకం తయారు చేసుకోవాలి. చిన్న గ్లాసు నీటిని వేసి బెల్లం వేసి కలియబెడుతూ తీగ పాకం తయారు చేసుకోవాలి. తీగపాకం ఏర్పడిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వేరుశనగ విత్తనాలను పాకంలో వేసి బాగా కలియ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన వేరుశెనగ పాకంపప్పు తయారైనట్లే.