Potato Curry : పొటాటో క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Potato Curry : పొటాటో క‌ర్రీ.. కింద చెప్పిన బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బంగాళాదుంప‌లు ఉంటే చాలు పావు గంట‌లో ఈ కర్రీని త‌యారు చేసుకోవచ్చు. అన్నంతో పాటు దోశ వంటి అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వచ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా చేసుకోద‌గిన ఈ పొటాటో కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చిమిర్చి – 5, అల్లం – ఒక అంగుళం ముక్క‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – పావు కిలో, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Potato Curry recipe better taste with rice or chapati
Potato Curry

పొటాటో క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం వేసి క‌చ్చాప‌చ్చ‌గా దంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, మిక్సీ ప‌ట్టుకున్న‌ప‌చ్చిమిర్చి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని కూడా వేయించిన త‌రువాత బంగాళాదుంపల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వేసుకోవాలి. వీటిని అంతా క‌లిసేలా కలుపుకుని 2 నిమిషాల పాటు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ వంటి వాటితో పాటు సైడ్ డిష్ గా కూడా తీసుకోవ‌చ్చు.ఈ విధంగా త‌యారు చేసిన పొటాటో క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts