మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవనశైలి మారుతోంది. అతి చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక వ్యాయామం సరిగా లేకపోవడం వలన చిన్న వయసులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఏది తినాలన్నా భయంగా ఉంటోంది. ఎంత తినాలన్నా భయమే. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా డయాబెటిస్ కు భయపడి నోరు కట్టుకోవలసి వస్తోంది.
అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. లడ్డూ అంటే ఇష్టం ఉండని వారెవరుంటారు చెప్పండి. ఈ లడ్డూను నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన మీ డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. మరి ఆ లడ్డూ తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
పొయ్యి మీద పాన్ పెట్టి తక్కువ మంటపై వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఓట్స్ ను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 20 బాదంపప్పులు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక కప్ప పుచ్చ గింజలు, అర కప్పు గుమ్మడి గింజలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి మంచి సువాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పొడి చేసుకున్న ఈ మిశ్రమాన్ని, దోరగా వేయించికున్న ఓట్స్ ను బౌల్‌లో వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఒక కప్పు బెల్లం తురుము, నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లడ్డులలా తయారు చేసుకోవాలి. తయారుచేసుకున్న ఈ లడ్డూలని ఫ్రిడ్జ్ లో పెడితే దాదాపు రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు రోజుకు ఒక లడ్డూ చొప్పున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా ఈ లడ్డూను తీసుకోవడం ద్వారా ఒంట్లో కొవ్వు కరిగి బరువు నియంత్రణలోకి వస్తుంది.