Tomato Mutton Curry : మనం మటన్ కర్రీని వివిధ రుచుల్లో వివిద పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటాము. ఎలా వండిన కూడా మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది మటన్ కర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే తరుచూ చేసే మటన్ కర్రీలతో పాటు కింద చెప్పిన విధంగా టమాటాలు వేసి వండే మటన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు వేసి చేసే ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కర్రీని కూడా అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మటన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 5 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన టమాటాలు – 5, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చింతపండు పులుసు – ఒక టేబుల్ స్పూన్, పుదీనా – కొద్దిగా, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ ఉడికించడానికి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, ఉప్పు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్.
టమాట మటన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో మటన్ ను వేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత కరివేపాకు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు పులుసు, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత ఉడికించిన మటన్ ను నీటితో సహా వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మటన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం మటన్ కర్రీలు కాకుండా ఇలా మరింత రుచిగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.