ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడు కోవడం కోసం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ప్రతి ఒక్కరిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం వంటి లక్షణాలు రావడం సర్వసాధారణమే. ముఖ్యంగా ఈ విధమైనటువంటి వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు చాలామందికి ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే ఆ నొప్పుల నుంచి విముక్తి పొందడం కోసం చాలామంది పెయిన్ కిల్లర్లు ఉపయోగిస్తున్నారు.
ఈ విధంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా పెయిన్ కిల్లర్ లను ఉపయోగించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర వ్యతిరేకతను చూపుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుగా పెయిన్ కిల్లర్ లను ఉపయోగించడం వల్ల వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత నొప్పులను తగ్గించడం కాకుండా, ఈ వ్యాక్సిన్ పనితీరుపై ప్రభావాన్ని చూపెడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే జ్వరం, తలనొప్పి వంటి వాటికి కేవలం పారాసెటమాల్ వాడటం వల్ల ఆ నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తుంది. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా ఈ విధమైనటువంటి పెయిన్ కిల్లర్ ఉపయోగించకూడదని ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో అసత్య ప్రచారాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా పెయిన్ కిల్లర్ తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ తర్వాత ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవని అసత్య ప్రచారాలుచేయటం వల్లే చాలా మంది ఈ విధంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగానే పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొందరిలో చర్మంపై దద్దుర్లు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తితే ఒకసారి డాక్టర్లను సంప్రదించి వారి సలహా సూచనల మేరకు పెయిన్ కిల్లర్లు ఉపయోగించాలని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365