ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ప్రజలు రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. కొందరు జిమ్‌లకు వెళితే కొందరు రన్నింగ్ చేస్తారు. ఇంకొందరు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. అయితే స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుదాం.
1. స్కిప్పింగ్ చేయడం వల్ల అధిక మొత్తంలో క్యాలరీలను తక్కువ సమయంలోనే ఖర్చు చేయవచ్చు. స్కిప్పింగ్ చేస్తే నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 క్యాలరీలు ఖర్చవుతాయి. అంటే 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా చాలు ఏకంగా 200 నుంచి 300 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.
2. సాధారణంగా చాలా మందికి రోజూ వ్యాయామం చేసేందుకు సమయం లభించదని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి వారు స్కిప్పింగ్ చేయవచ్చు. దీన్ని సాయంత్రం కూడా చేయవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.
3. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు స్కిప్పింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. కొందరికి శరీరం మొత్తం బాగానే ఉంటుంది. కానీ పొట్ట దగ్గరే కొవ్వు ఉంటుంది. దాన్ని కరిగించేందుకు అలాంటి వారు రోజూ స్కిప్పింగ్ చేయాలి. ఇది చాలా అత్యుత్తమమైన వ్యాయామం. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు వేగంగా కరుగుతుంది.
4. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం ఎటంటే అటు వంగుతుంది. భవిష్యత్తులో శరీర అవయవాలు పట్టేయకుండా ఉంటాయి. కండరాలకు బలం చేకూరుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి.
5. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది.
6. స్కిప్పింగ్ చేయడం వల్ల గుండెకు ఎంతో చక్కని వ్యాయామం జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు, ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.
సూచన – స్కిప్పింగ్ చేసేవారు ముందుగా 10 నిమిషాల పాటు వార్మప్ చేయడం మంచిది. అలాగే షూస్ ధరించి స్కిప్పింగ్ చేస్తే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365