కొత్త కోవిడ్ స్ట్రెయిన్ దేశంలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విషయంపై ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతోపాటు త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు అన్నీ కూడా కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన సైంటిఫిక్ అడ్వయిజర్ ప్రొఫెసర్ కె.కృష్ణస్వామి విజయ్ రాఘవన్ మీడియాతో మాట్లాడారు.
కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను యూకేతోపాటు పలు దేశాల్లో గుర్తించారని అన్నారు. అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అనేక వ్యాక్సిన్లతోపాటు కొత్తగా అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు కూడా నూతన కోవిడ్ స్ట్రెయిన్ నుంచి రక్షణ కల్పిస్తాయని అన్నారు. వ్యాక్సిన్ల వల్ల భిన్న రకాల యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయని, అవి కొత్త కోవిడ్ వైరస్‌ను నాశనం చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు నూతన కోవిడ్ స్ట్రెయిన్‌పై పనిచేయవని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు ఈ విషయాన్ని ఇంకా శాస్త్రీయంగా ధ్రువీకరించలేదని అన్నారు. అందువల్ల కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పట్ల భయపడాల్సిన పనిలేదని అన్నారు.
కాగా దేశంలో ప్రస్తుతం 6 కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కేసులను నిర్దారించారు. వారందరూ ఇటీవలే యూకే నుంచి భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారి జీనోమ్ సీక్వెన్స్‌ను విశ్లేషించిన అనంతరం ల్యాబ్‌లు వివరాలను వెల్లడించాయి. బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో 3, హైదరాబాద్ సీసీఎంబీలో 2, పూణె ఎన్ఐవీలో ఒక కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కేసులను నిర్దారించారు. ఈ క్రమంలో బాధితులను ప్రత్యేకమైన గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని కూడా ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంచారు.