కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి వ్యాప్తి చెందింది. ఎంతో మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 11,23,05,539 మంది కోవిడ్ బారిన పడ్డారు. 24,86,641 మంది చనిపోయారు. ఈ క్రమంలోనే కోవిడ్ వచ్చిన వారికి చికిత్సను అందించేందుకు ఇప్పటి వరకు వైద్య నిపుణులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక విధానాలను, మెడిసిన్లను వారు కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఓజోన్ థెరపీ కూడా కోవిడ్ చికిత్సలో సత్ఫలితాలను ఇస్తుందని వైద్య నిపుణులు తేల్చారు.
డాక్టర్ మిలి షా, డాక్టర్ జిగ్నాషా కెప్టెన్ అనే వైద్య నిపుణలు ఇప్పటి వరకు సుమారుగా 400 మందికి పైగా కోవిడ్ పేషెంట్లకు ఓజోన్ థెరపీ చేశారు. దీంతో పేషెంట్లలో రక్త సరఫరా మెరుగు పడిందని, ఇన్‌ఫెక్షన్, నొప్పి తగ్గిందని, వ్యాధి నుంచి త్వరగా కోలుకున్నారని తేల్చారు. ఆక్సిజన్‌ను, ఓజోన్‌ను కలిపి థెరపీ చేయడం ద్వారా కోవిడ్ 19 పేషెంట్లలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు.
ఓజెన్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మిలీ షా, డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ జిగ్నాషా కెప్టెన్‌లు ఈ మేరకు తాజాగా వివరాలను వెల్లడించారు. ముందుగా వారు 230 మంది కోవిడ్ పేషెంట్లకు గతంలో ఓజోన్ థెరపీ చేపట్టారు. తరువాత మరో 60 మందికి, ఆ తరువాత ఇంకొంత మందికి.. ఈ థెరపీ చేస్తూ పోయారు. మొత్తం వారు అలా 400 మందికి పైగా కోవిడ్ పేషెంట్లకు ఓజోన్ థెరపీ చేయగా.. అధిక శాతం మందిలో సత్ఫలితాలు కనిపించాయని చెప్పారు. అందువల్ల కోవిడ్ చికిత్సకు ఓజోన్ థెరపీ ట్రై చేయవచ్చని అన్నారు.
అయితే ఓజోన్ థెరపీ అనేది నిజానికి కొత్తేమీ కాదు. ఇప్పటికే దీన్ని.. నయం కాని పుండ్లు, అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లు, బాక్టీరియా, వైరస్, ఫంగస్ వ్యాద/లఉ, వెరికోస్ వీన్స్, రక్తనాళాలు గట్టిపడడం, ఎగ్జిమా, క్యాన్సర్, కాండిడా, ఎండోమెట్రియోసిస్, పీసీవోడీ, ఇన్‌ఫెర్టిలిటీ, ఈఎన్టీ ఇన్‌ఫెక్షన్లు, ఆర్థరైటిస్, వెన్ను నొప్పులు, స్పాండిలైటిస్, లివర్ వ్యాధులు, హెపటైటిస్, మెదడు వ్యాధులు.. వంటి వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. అయితే కోవిడ్‌కు ఈ థెరపీ పనిచేస్తుండడంపై నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని వారు తెలిపారు.