1 Spoon Flaxseed : వారం రోజుల పాటు రోజూ ఒక్క స్పూన్ తినండి చాలు.. మీ శ‌రీరంలో జ‌రిగేది చూసి ఆశ్చ‌ర్య‌పోతారు..!

1 Spoon Flaxseed : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అవిసె గింజ‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్, ప్రోటీన్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శక్తి మెరుగుప‌డుతుంది. గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అవిసె గింజ‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల ఆర్ట‌రీస్ లో వ‌చ్చే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. దీని కోసం అవిసె గింజ‌ల‌ను వేయించి జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి.

త‌రువాత ఒక గ్లాస్ నీటిలో లేదా పాల‌ల్లో ఈ పొడిని అర టేబుల్ స్పూన్ మోతాదులో క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా పేరుకుపోకుండ ఉంటుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా క‌లిగి ఉన్న‌వారు ఈ అవిసె గింజ‌ల‌ను రోజూ ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అదే విధంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. రోజూ రాత్రి నిద్ర‌పోయే ముందు ఒక చెంచా అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు చాలా సుల‌భంగా త‌గ్గుతుంది. శ‌రీరంలో మెటబాలిజం రేటును పెంచి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో ఈ గింజ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

1 Spoon Flaxseed daily many amazing benefits
1 Spoon Flaxseed

అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఇందులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోద‌క వ‌క్తి పెరుగుతుంది. తద్వారా మ‌నం వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో అలాగే చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts