Ajwain Chapati : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో తప్పక నియమాలను పాటించాలి. వేళకు భోజనం చేయడంతోపాటు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే అతిగా భోజనం చేయరాదు. రాత్రి 7 గంట లోపే భోజనం చేసే ప్రయత్నం చేయాలి. దీంతో ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇక రాత్రి పూట భోజనంలోనూ చాలా మంది చపాతీలను తింటారు. వీటి వల్ల కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది.
రాత్రి పూట చపాతీలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. రాత్రి పూట నూనె వేయకుండా రెండు పుల్కాలను కాల్చి తింటే బరువు తగ్గుతారు. షుగర్ అదుపులోకి వస్తుంది. బీపీ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఉండదు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే రాత్రి తినే పుల్కాలలో కాస్త వాము ఉంటే ఇంకా మనకు ఎంతో మేలు జరుగుతుంది. రాత్రి పూట పుల్కాలను చేసేటప్పుడు వాటిల్లో కాస్త వాము కలపాలి. దీని వల్ల మనకు ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే గుణాలు వాములో ఉంటాయి.
రాత్రి పూట వాము కలిపిన పుల్కాలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతో అజీర్ణం బాధించదు. అలాగే గ్యాస్ ఉండదు. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. మలబద్దకం అన్నది ఉండదు. మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. ఇక రాత్రి పూట ఇలా వాముతో పుల్కాలను చేసుకుని తింటే శరీరంలో వాపులు అన్నవి కూడా ఉండవు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రాత్రి పూట చపాతీలను తింటున్నవారు వాటిల్లో కాస్త వాము వేసి కలిపి తింటే ఎంతో మేలు పొందవచ్చు. చపాతీలను చేసేటప్పుడే కాస్త వాము కలిపితే మంచిది. దీంతో రెండు విధాలుగా మనం ప్రయోజనం పొందవచ్చు.