Guava Leaves Water : మన చుట్టూ పరిసరాల్లో విరివిగా పెరిగే చెట్లలో జామ చెట్టు ఒకటి. జామ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మరీ పండుగా మారకపోయినా.. కొద్దిగా పచ్చిగా లేదా దోరగా ఉన్నప్పుడు కూడా రుచిగానే ఉంటాయి. జామకాయలను పేదోడి యాపిల్ అని పిలుస్తారు. ఎందుకంటే యాపిల్ పండ్లలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు జామకాయల్లోనూ ఉంటాయి. పైగా ధర కూడా తక్కువే. అందుకనే వాటిని అలా పిలుస్తారు. ఇక జామకాయల్లాగే జామ ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం జామ ఆకులు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో తయారు చేసే నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
జామ ఆకులు 3, 4 తీసుకుని శుభ్రంగా కడగాలి. అనంతరం వాటిని ఒక పాత్రలోని నీటిలో వేసి మరిగించాలి. 15 నిమిషాల పాటు సన్నని మంటపై నీళ్లను మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. అందులో అవసరం అనుకుంటే కొద్దిగా నిమ్మరసం, తేనెలను కలుపుకోవచ్చు. ఇలా రోజూ పరగడుపునే జామ ఆకుల నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
జామ ఆకుల్లో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ కూడా వీటిలో ఎక్కువే. అందువల్ల హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. వారు జామ ఆకుల నీళ్లను తాగితే దెబ్బకు బీపీ తగ్గిపోతుంది. రక్తసరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ నియంత్రణలోకి వస్తుంది.
జామ ఆకులు వాంతులు, విరేచనాలను తగ్గిస్తాయి. జామ ఆకుల నీళ్లను తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
షుగర్ సమస్య ఉన్నవారికి జామ ఆకులు అద్భుతమైన వరమనే చెప్పవచ్చు. జామ ఆకుల నీళ్లను తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే అధికంగా బరువు ఉన్నవారు ఈ నీళ్లను తాగితే మేలు జరుగుతుంది. బరువు త్వరగా తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.
దంతాలు, చిగుళ్లు, నోటి సమస్యలు ఉన్నవారు జామ ఆకుల నీళ్లను తాగితే ప్రయోజనం ఉంటుంది. దీంతో నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. అలాగే చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గుతుంది. మొటిమలు పోతాయి.
జామ ఆకుల నీళ్లు పురుషులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల నీళ్లను తాగడం వల్ల పురుషుల్లో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.