Purple Color Foods : మనకు తినేందుకు ఎన్నో రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అనారోగ్యకరమైనవి అయితే కొన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారాల్లో మనకు పలు రకాల భిన్న రంగుల్లో ఉండే ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పర్పుల్ కలర్ ఆహారాలు ఒకటి. ఇలాంటి రంగులో ఉన్న ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాల్లో ఆంథోసయనిన్స్ అనబడే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో దోహదపడతాయి. అలాగే ఈ ఆహారాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
2. పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో కళ్ల జోడు అవసరం ఉండదు. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు.
3. జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉండేవారు పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాలను తింటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు తగ్గుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.
4. పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
5. మన చర్మానికి పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
6. పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాలను తరచూ తినడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగవు. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.