Thaman : ఈ మధ్య కాలంలో విడుదలైన అనేక చిత్రాలు థమన్ మ్యూజిక్ అందించిన విషయం విదితమే. అఖండ, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలకు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే థమన్‌పై ఎప్పటికప్పుడు కొత్త ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అతను మ్యూజిక్‌ను ఎక్కడి నుంచో కాపీ చేసి తన సినిమాలకు వాడుకుంటాడనే అపవాదు ఉంది. ఇక తాగాజా భీమ్లా నాయక్ విషయంలోనూ మరోసారి ఇలాంటి ఆరోపణలే అతనిపై వస్తున్నాయి.
భీమ్లా నాయక్ సినిమాలో రానాను కలిసేందుకు పవన్ వెళ్లినప్పుడు ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అయితే అది ఒక ఇంగ్లిష్ పాటలోనిదని.. థమన్ దాన్ని అలాగే కాపీ చేసి పెట్టాడని కొందరు ఆరోపిస్తున్నారు. కావాలంటే చూడండి.. అంటూ వారు రుజువును కూడా చూపిస్తున్నారు. అయితే థమన్ దీనిపై ఇంకా స్పందించలేదు.
#BheemlaNayak climax bgm ????????https://t.co/tc3uqAp0F0
— Retired ICT Fan (@Jon_Snow_10) March 1, 2022
గతంలోనూ థమన్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. థమన్ మ్యూజిక్‌ను కాపీ కొట్టడం కొత్తేమీ కాదని.. కొత్తగా అతను ఏమీ ట్రై చేయడని.. ఎక్కడో ఎవరో కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను కాపీ కొడుతుంటాడని.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా భీమ్లా నాయక్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మరి ఇందుకు థమన్ ఏమని స్పందిస్తాడో చూడాలి.