Samantha : గతేడాది అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఎంతో మందిని విచారంలోకి నెట్టేశారు. వారు విడాకులు తీసుకోవడం అసలు ఎవరికీ నచ్చలేదు. దీంతో చాలా మంది అభిమానులు తీవ్రంగా మనస్థాపం చెందారు. అయితే ఇప్పటికీ వారు విడాకులు ఎందుకు తీసుకున్నారన్న కారణం తెలియదు. కానీ సమంత గతంలో నాగచైతన్య గురించి పెట్టిన పోస్టులను కొందరు వైరల్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో పోస్ట్ వైరల్ అవుతోంది.

గతంలో సమంత ఒక సందర్భంలో నాగచైతన్య గురించి ఒక పోస్ట్ పెట్టింది. నాగచైతన్యే నాకు అన్నింటి కన్నా ఎక్కువ.. ఆయన కోసం ఎంత పని ఉన్నా వదులుకుని రోజూ ఇంటికి వస్తా.. అని పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్‌ను ఇప్పుడు కొందరు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో ఆమె ఆ పోస్ట్‌ను పెట్టినా.. విడాకుల నిర్ణయం ప్రకటించిన తరువాత కొద్ది రోజులకు ఆమె ఆ పోస్టును డిలీట్ చేసింది. దీంతో అక్కినేని అభిమానులు ఆమెను తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ పాత పోస్టు తాలూకు స్క్రీన్ షాట్స్‌ను ఇప్పుడు కొందరు వైరల్ చేస్తున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే మూవీ ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతిలు కీలకపాత్రల్లో నటించారు. అలాగే శాకుంతలం అనే మరో సినిమాలో సమంత శకుంతలగా నటించింది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీంతోపాటు యశోద అనే పాన్ ఇండియా సినిమాలోనూ సమంత నటిస్తోంది.