Onion Peel : ఉల్లిపాయలను నిత్యం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే. ఉల్లిపాయల వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు ఉల్లిపాయల్లో లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవలం ఉల్లిపాయలే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మనకు ఉపయోగకరమే. చాలా మంది ఉల్లిపాయలను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టును వడబోస్తే ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు. దాన్ని రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన వాటికి నచ్చదు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టకముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దనా చేయాలి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు, ఇతర సమస్యలు పోతాయి. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా అధిక బరువు తగ్గడమే కాదు, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందుకే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. క్వర్సెటిన్ అని పిలవబడే ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. అందుకని ఆ సూప్ ను తాగితే పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణతుల వృద్ధిని తగ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్‌లో ఉంటుంది. కనుక ఇకపై ఉల్లిపాయలకు పొట్టు తీస్తే దాన్ని పడేయకండి. దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.