Patika Bellam : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పటిక బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం పటిక బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. పటిక బెల్లంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పటికబెల్లం పొడి, అల్లం రసంలను కలిపి తీసుకుంటే ఎంతటి దగ్గు, జలుబు అయినా సరే వెంటనే తగ్గుతాయి. శరీరంలో ఉన్న కఫం మొత్తం పోతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. సీజనల్‌గా వచ్చే సమస్యల నుంచి బయట పడవచ్చు.
2.పటికబెల్లం పొడి, మిరియాల పొడి, కొద్దిగా నెయ్యిలను కలిపి మిశ్రమంగా చేసి తీసుకోవాలి. దీంతో సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి.
3. గొంతు సమస్యలు ఉన్నవారు కొద్దిగా పటిక బెల్లం తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి. దీంతో గొంతు నొప్పి, మంట, దగ్గు, దురద తగ్గిపోతాయి.
4. యాలకులు రెండు భాగాలు, పటిక బెల్లం ఒక భాగం తీసుకుని పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 3 నుంచి 4 సార్లు తీసుకోవాలి. దీని వల్ల కూడా దగ్గు తగ్గుతుంది.
5. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు పసుపు, పటికబెల్లం పొడి, మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ఒక కప్పు గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. దీన్ని రాత్రి పూట తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.
5. పటికబెల్లంకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అందుకుగాను ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక రెక్క కుంకుమ పువ్వు, కొద్దిగా పటికబెల్లం పొడి కలిపి రోజూ రాత్రి తాగాలి. దీంతో శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. రక్తం పెరుగుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
6. ఒక గ్లాస్ చల్లని నీటిలో కొద్దిగా పటికబెల్లం పొడి కలిపి తాగడం వల్ల శరీరానికి చలువ కలుగుతుంది. శరీరంలో ఉండే వేడి మొత్తం బయటకు పోతుంది. వేడి శరీరం ఉన్నవారు ఇలా చేస్తే మంచిది. దీంతో శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.
7. అరచేతులు, పాదాల్లో మంటలుగా ఉన్నవారు కొద్దిగా పటికబెల్లం పొడిలో వెన్న కలిపి రాయాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.