ప్రపంచంలో సాధారణంగా ఎవరైనా సరే యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. వృద్ధాప్యం వస్తున్నా చర్మంపై ముడతలు కనిపించవద్దని, యంగ్‌గా కనిపించాలని ఆశిస్తుంటారు. అయితే రోజూ మనం తీసుకునే కొన్ని ఆహారాల వల్ల మన చర్మానికి వయస్సు త్వరగా అయిపోతుంది. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. అలా జరగకుండా ఉండాలన్నా, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలన్నా.. అందుకు కింద తెలిపిన ఆహారాలను మానేయాలి. దీంతో చర్మం వయస్సు అయిపోవడం తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. యవ్వనంగా ఉంటారు.
1. చిప్స్
ఆలుగడ్డలు లేదా ఇతర ఏ పదార్థాలకు చెందిన చిప్స్ అయినా సరే మానేయాలి. ఎందుకంటే వాటిని అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసిన నూనెలో వేసి వేయించి తయారు చేస్తారు. ఈ క్రమంలో వాటిని తినడం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి చర్మ కణాలను నాశనం చేస్తాయి. దీంతో చర్మం దృఢత్వాన్ని కోల్పోయి సాగుతుంది. ఈ క్రమంలో చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. కనుక వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే చిప్స్ తినడం మానేయాలి.
2. వైట్ బ్రెడ్
రీఫైన్ చేయబడిన పదార్థాలతో వైట్ బ్రెడ్ తయారు చేస్తారు. ఇదే కాదు రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలు కలిగిన ఏ పదార్థాలనూ తినకూడదు. వాటిని తింటే వాటిల్లో ఉండే అధిక గ్లైసీమిక్ ఇండెక్స్ కారణంగా చర్మం వాపులకు గురవుతుంది. దీంతో చర్మం వయస్సు త్వరగా అయిపోతుంది. ఫలితంగా త్వరగా ముడతలు వస్తాయి. కనుక రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తినడం మానేయాలి.
3. చక్కెర
చక్కెర ఉండే పదార్థాలను ఎక్కువగా తిన్నా దాని ప్రభావం చర్మంపై పడుతుంది. కనుక చర్మం యవ్వనంగా కనిపించాలంటే చక్కెరను తినడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.
4. ప్రాసెస్ చేయబడిన మాంసం
ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని తింటే చర్మానికి హాని కలుగుతుంది. ఆ మాంసంలో సోడియం, శాచురేటెడ్ ఫ్యాట్స్, సల్ఫైట్‌లు అధిక మోతాదుల్లో ఉంటాయి. దీని వల్ల చర్మంలో ద్రవాలు లోపిస్తాయి. చర్మం బలహీనంగా మారుతుంది. వాపులకు గురవుతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. కనుక ప్రాసెస్ చేయబడిన మాంసంకు దూరంగా ఉండాలి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
5. సోడా, కాఫీ
సోడాలు, కాఫీ, కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. వాటిని తాగడం మానేస్తే చర్మంపై ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.
6. మద్యం
మద్యం సేవించడం వల్ల చర్మం ఎరుపుగా మారుతుంది. వాపులకు గురవుతుంది. కనుక మద్యం సేవించడం మానేయాలి. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది.
పైన తెలిపిన ఆహారాలను మానేయడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365